Palamuru MLC Naveen Kumar Reddy donated ₹3 lakh for thalassemia patients on KTR’s birthday, receiving praise from KTR for his noble gesture..పాలమూరు ఎమ్మెల్సీ

పాలమూరు ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి కేటీఆర్ జన్మదినం సందర్భంగా తలసేమియా బాధితులకు 3 లక్షల చెక్కు అందజేశారు. ఈ సేవా కార్యక్రమాన్ని కేటీఆర్ అభినందించారు.
Palamuru MLC Naveen Kumar Reddy donated ₹3 lakh for thalassemia patients on KTR’s birthday, receiving praise from KTR for his noble gesture.

హైదరాబాద్:
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని హైదరాబాద్‌లో నిర్వహించిన వేడుకల్లో పాలమూరు ఎమ్మెల్సీ నాగర్‌కుంట నవీన్ కుమార్ రెడ్డి ప్రత్యేకంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తలసేమియా బాధితుల వైద్య సహాయార్థం 3 లక్షల రూపాయల చెక్కును కేటీఆర్ చేతుల మీదుగా అందజేశారు. మహబూబాబాద్ మాజీ ఎంపీ మాలోతు కవిత కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

కేటీఆర్ మాట్లాడుతూ, “ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న” అని, నవీన్ రెడ్డి చేసిన ఔదార్యాన్ని అభినందించారు. తలసేమియా బాధితులను సామాజికంగా ఆదుకోవడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని ఆయన సూచించారు. తన జన్మదినం సందర్భంగా సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం అయిన అందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, కేటీఆర్ జన్మదినం సందర్భంగా ఉమ్మడి పాలమూరు జిల్లా తరఫున ఈ ఆర్థిక సహాయాన్ని అందజేయడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. కేటీఆర్ నాయకత్వంలో తెలంగాణ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం మరింత బలపడుతుందని నమ్ముతున్నట్టు తెలిపారు.
Hyderabad:
BRS Working President K. T. Rama Rao’s birthday celebrations in Hyderabad witnessed a notable act of generosity from Palamuru MLC Nagar Kunta Naveen Kumar Reddy. As part of the event, Naveen Reddy handed over a cheque of ₹3 lakh to aid thalassemia patients. Former Mahbubabad MP Maloth Kavitha was also present during the program.

KTR appreciated the gesture, saying, “Hands that help are greater than lips that pray,” and congratulated Naveen Reddy for his service. He urged everyone to extend support to thalassemia patients in any possible way. He also thanked all party leaders and supporters who organized social service activities on the occasion of his birthday.

MLC Naveen Kumar Reddy said he was pleased to offer this financial support on behalf of the undivided Palamuru district, marking KTR’s birthday with a meaningful initiative. He expressed hope that Telangana would continue to progress under KTR’s leadership and added that BRS would remain strong in the future.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *