
పహల్గాం ఉగ్రదాడి ఘటనపై చర్చ కోరుతూ విపక్షాలు లోక్‌సభలో పెద్దఎత్తున నినాదాలు చేయడంతో సభ వాయిదా పడింది.
Opposition parties disrupted Lok Sabha demanding a debate on the Pahalgam terror attack and Operation Sindoor, leading to adjournment amid chaos.
పహల్గాం ఉగ్రదాడి ఆపరేషన్ సిందూర్‌పై చర్చకు విపక్షాల పట్టు
సభలో పెద్ద ఎత్తున నినాదాలు..సభ వాయిదా
న్యూఢిల్లీ, జూలై 21: పహల్గాం ఉగ్రదాడి ఘటన పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ దాడి, ఆపరేషన్ సిందూర్‌పై చర్చించాలంటూ విపక్ష ఎంపీలు లోక్‌సభలో గట్టిగా పట్టుబట్టారు. వారి నిరసనలతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. స్పీకర్ ఓం బిర్లా చెప్పినప్పటికీ, సభ్యులు వినిపించుకోకపోవడంతో మధ్యాహ్నం 12 గంటలకు సభను వాయిదా వేయాల్సి వచ్చింది.
వర్షాకాల సమావేశాలు సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత ఉభయ సభలు తొలిసారి సమావేశమవుతున్న సందర్భంలో విపక్షాలు ఈ అంశాలను ప్రస్తావించాయి. పలు వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టి, చర్చకు డిమాండ్ చేశాయి.
స్పీకర్ ప్రశ్నోత్తరాల అనంతరం వాయిదా తీర్మానాలపై చర్చిస్తామని తెలిపినా, ఎంపీలు వినిపించుకోలేదు. సభలో పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో, కార్యకలాపాలు సజావుగా సాగలేకపోయాయి. విపక్షాల ఆందోళనల మధ్యే సభను మధ్యాహ్నం వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.