
14 నెలల పాలనలో అభివృద్ధి లేదు, అప్పు మాత్రం పెరిగింది – వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత రవీంద్రనాథ్ రెడ్డి విమర్శ
తెలుగుదేశం నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం 14 నెలలు పాలించినా అభివృద్ధి కనిపించలేదని, కానీ రాష్ట్రాన్ని రూ.1.86 వేల కోట్లు అప్పుల్లో ముంచిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కడప జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు.
Despite being in power for 14 months, the TDP-led alliance has shown no signs of real development, but has pushed the state into a debt of ₹1.86 thousand crores, said YSR Congress Party Kadapa district president P. Ravindranath Reddy at a press meet held at the party office in Kadapa.
అయన మాట్లాడుతూ… ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ మర్చిపోయారని, ప్రభుత్వ ఉద్యోగులకు రావలసిన అరియర్స్ ఇప్పటికీ చెల్లించలేదన్నారు. స్త్రీ నిధి పథకం అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్ముకోవాలని మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు దారుణమని విమర్శించారు.
తల్లికి వందనం పథకాన్ని పూర్తిగా అమలు చేయకపోయినట్లే, లక్షలాది లబ్ధిదారులను నిబంధనలు పేరుతో వంచించారని అన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలను మోసం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని ఆయన విమర్శించారు.
చంద్రబాబు పాలన “సొమ్ము ఒకడిది, సోకు ఒకరిది” అన్న తత్వంతో నడుస్తోందని, మహిళల ఉచిత బస్సు ప్రయాణం, అన్నదాత సుఖీభవ వంటి హామీలపై ఒక్క మాట కూడా ప్రభుత్వ ప్రతినిధులు మాట్లాడటం లేదని విమర్శించారు.
ఈ సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
No Development in 14 Months, ₹1.86K Crore Debt – YSRCP Leader Ravindranath Reddy
The 14-month rule of the TDP-led coalition government has brought no visible development but has burdened the state with a debt of ₹1.86 thousand crores, alleged YSR Congress Party Kadapa district president P. Ravindranath Reddy.
Speaking at a press conference at the YSR Congress Party office in Kadapa, he said that all the promises made during the elections have been forgotten. He accused the government of not even clearing arrears owed to state employees. He strongly criticized Minister Achchennaidu’s statement that the Sthree Nidhi scheme could only be implemented if the state were sold.
He stated that the Thalliki Vandanam scheme was not fully implemented, and lakhs of beneficiaries were unfairly removed under the guise of regulations. He further alleged that Chandrababu Naidu has the unique distinction of deceiving people across all sections and castes in the state.
Ravindranath Reddy said that Chandrababu’s governance operates on the principle of “one person’s money, another person’s benefit,” while welfare promises such as free bus travel for women and the Annadata Sukhibhava scheme have not even been discussed by the government.