జూలై 15 నుంచి ద్విచక్ర వాహనాలపై టోల్ వసూలు చేస్తారన్న వార్తలపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టత ఇచ్చారు. రెండు చక్రాల వాహనాలపై టోల్ పన్ను విధించే ఉద్దేశం లేదని తేల్చి చెప్పారు.

No Toll on Two-Wheelers, Clarifies Nitin Gadkari Amid Rumors

న్యూఢిల్లీ, జూన్ 26:
జాతీయ రహదారులపై ద్విచక్ర వాహనాలకు టోల్ ఫీజు వసూలు చేయనున్నట్లు వస్తున్న వార్తలపై కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. జూలై 15 నుంచి టోల్ అమలులోకి వస్తుందని జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు.

ద్విచక్ర వాహనాలపై టోల్ విధించే ఉద్దేశం కేంద్రానికి లేదని స్పష్టం చేశారు. టూ వీలర్లపై టోల్ ఫీజు వసూలు చేయబోమన్నది కేంద్ర స్థాయి నిర్ణయమని తెలిపారు. కొన్ని మీడియా సంస్థలు ప్రజలను తప్పుదారి పట్టించేలా సమాచారం ప్రసారం చేస్తుండటాన్ని గడ్కరీ తప్పుపట్టారు.

ఇలాంటి అసత్య వార్తలు ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నాయని పేర్కొన్నారు. ఎన్‌హెచ్‌ఏఐ (జాతీయ రహదారి ప్రాధికార సంస్థ) కూడా ఈ అంశంపై ప్రకటన విడుదల చేసి, టోల్ ఫీజు వసూలు చేసే ప్రతిపాదనేదీ లేదని స్పష్టంచేసింది.

New Delhi, June 26:
Union Minister for Road Transport and Highways Nitin Gadkari has strongly denied the news reports suggesting that the central government is planning to impose toll tax on two-wheelers on national highways starting July 15.

Terming the reports as misleading, Gadkari clarified that there is no proposal to collect toll from two-wheelers. He condemned certain media outlets for spreading false and confusing information that is not based on facts.

He assured that two-wheelers will continue to be exempt from toll fees, and urged the public not to believe in baseless rumors. Supporting his statement, NHAI (National Highways Authority of India) also released a clarification confirming that no such toll plan exists for two-wheelers.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *