Modi’s 11 Years in Power is a Golden Era: Bandi Sanjay for english news kindly scroll down

మోదీ పాలన స్వర్ణయుగం: కేంద్ర మంత్రి బండి సంజయ్
తిరుపతి:
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలన దేశానికి అభివృద్ధి, సంక్షేమం, దేశభక్తి, ఆవిష్కరణలు అందించిన స్వర్ణయుగంగా నిలిచిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు.
బుధవారం ఆయన తిరుపతిలో మోదీ 11 సంవత్సరాల పాలనపై ఏర్పాటు చేసిన విజయ ప్రదర్శనను సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ, “భారత్ ప్రస్తుతం ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచింది. త్వరలోనే అగ్రస్థానానికి చేరుకుంటుంది” అని విశ్వాసం వ్యక్తం చేశారు.
గరీబ్ కళ్యాణ్ అన్న యోజన, పిఎం ఆవాస్ యోజన, జనధన్ అకౌంట్స్, ఆయుష్మాన్ భారత్, స్వనిధి, ముద్రా యోజన, స్టార్టప్ ఇండియా వంటి పథకాల ద్వారా కోట్లాది మంది పేదలకు మోదీ పాలన మేలు చేస్తోందని వివరించారు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిబద్ధతతో ఉంది అని, అవసరమైన నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. ప్రతిపక్షాల విమర్శలను పట్టించుకోకుండా, అభివృద్ధి పథంలో ముందుకు సాగుతామని స్పష్టం చేశారు.
Modi’s 11-Year Rule is a Golden Era: Union Minister Bandi Sanjay
Tirupati:
Union Minister of State for Home Affairs Bandi Sanjay Kumar praised Prime Minister Narendra Modi’s leadership, calling the 11 years of his governance a “Golden Era” marked by development, welfare, patriotism, and innovation.
On Wednesday, Bandi Sanjay visited Tirupati and attended an exhibition highlighting the achievements of the Modi government over the past decade. Speaking to the media, he stated, “India now stands as the 4th largest economy in the world. Very soon, we will rise to the top position.”
He emphasized that crores of poor citizens have benefitted through various central schemes such as Garib Kalyan Anna Yojana, PM Awas Yojana, Jan Dhan Yojana, Ayushman Bharat, PM SVANidhi, MUDRA Yojana, and Startup India.
“We are committed to the development of Andhra Pradesh and are allocating necessary funds,” he assured. Responding to criticism from opposition parties, he said the central government remains focused on progress and does not bother about baseless allegations.