Medical camp and health awareness session conducted at Telangana Social Welfare Women’s Degree Gurukul College in Shamirpet, focusing on menstrual hygiene and nutrition.

మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా, శామీర్‌పేట్, మార్చి 12: మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో విద్యార్థినుల కోసం వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ భాగ్యలక్ష్మి పాల్గొని ఆరోగ్యానికి సంబంధించిన పలు ముఖ్య సూచనలు అందించారు.
మెన్స్ట్రువల్ హైజీన్‌పై అవగాహన కల్పిస్తూ నెలసరి సమయంలో సరైన పరిశుభ్రత పాటించకపోతే తలెత్తే ఆరోగ్య సమస్యలను వివరించారు. అలాగే సీజనల్ వ్యాధుల నివారణ చర్యలు, నిర్వహణ విధానాలు, పోషకాహారం, శారీరక వ్యాయామం, సమతుల ఆహారం వంటి అంశాలపై సెమినార్ నిర్వహించారు.
విద్యార్థినులలో అవగాహన పెంచేందుకు పోస్టర్ ప్రెజెంటేషన్ కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు సుచరిత, రజిని విద్యార్థినుల సందేహాలకు సమాధానాలు ఇచ్చి మార్గదర్శనం చేశారు.