Marking Kargil Vijay Diwas, BJP organized a massive rally in Jadcherla. Telangana BJP President N. Ramchander Rao urged that every citizen must be ready to protect the nation…సైనికుల త్యాగాలను

సైనికుల త్యాగాలను స్మరించుకుంటూ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా జడ్చర్లలో బిజెపి భారీ ర్యాలీ నిర్వహించింది. ప్రతి పౌరుడూ దేశ రక్షణకు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు పిలుపునిచ్చారు.

Marking Kargil Vijay Diwas, BJP organized a massive rally in Jadcherla. Telangana BJP President N. Ramchander Rao urged that every citizen must be ready to protect the nation.

జడ్చర్ల, జూలై 26
కార్గిల్ విజయ్ దివస్‌ను పురస్కరించుకుని జడ్చర్ల నియోజకవర్గంలోని రాజాపూర్ మండలంలో బిజెవైఎం ఆధ్వర్యంలో భారీ ర్యాలి జరిగింది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ఈ ర్యాలీలో పాల్గొని, భారత మాజీ ఆర్మీ జవాన్లను ఘనంగా సత్కరించారు. దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన వీర సైనికుల త్యాగాలు ఎప్పటికీ మరువలేనివని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ, జిల్లా అధ్యక్షులు మరియు బిజెవైఎం కార్యకర్తలకు రామచంద్ర రావు ధన్యవాదాలు తెలిపారు.

మీడియా సమావేశంలో మాట్లాడుతూ రామచంద్ర రావు, 1999లో కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందిన అమరవీరులకు నివాళులు అర్పించారు. పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసిన కుట్రను భారత సైన్యం ధైర్యంగా ఎదుర్కొని విజయాన్ని సాధించిందని, అటల్ బిహారీ వాజ్‌పేయి నాయకత్వంలో శత్రువులను తరిమికొట్టి భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నారని గుర్తుచేశారు. సర్జికల్ స్ట్రైక్స్, వైమానిక దాడులు వంటి చర్యలు ఉగ్రవాద నిర్మూలనకే అని, ఇప్పుడు దేశం మారిందని ఆయన పేర్కొన్నారు. సైనికులే కాదు, ప్రతి యువకుడు, ప్రతి పౌరుడు దేశాన్ని రక్షించేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్గిల్ విజయ్ దివస్ యువతలో దేశభక్తి, జాతీయతను పెంపొందించే వేడుకగా నిలవాలని అన్నారు.

BJP marked Kargil Vijay Diwas with a massive rally in Jadcherla, where Telangana BJP President N. Ramchander Rao called on every citizen to be prepared to protect the nation, not just the soldiers.

On the occasion of Kargil Vijay Diwas, a massive rally was organized under the leadership of BJYM in Rajapur mandal of Jadcherla constituency. Telangana BJP President N. Ramchander Rao participated in the rally and honored former Indian Army soldiers. He stated that the sacrifices of brave soldiers who gave their lives for the country’s protection will never be forgotten. Ramchander Rao extended heartfelt thanks to Mahabubnagar MP DK Aruna, district leaders, and all BJYM activists who organized the event.

Speaking at a media meet, Ramchander Rao paid tributes to the martyrs of the 1999 Kargil War, recalling how Pakistan-backed infiltrators tried to enter India and how the Indian Army courageously fought back under the leadership of then Prime Minister Atal Bihari Vajpayee. He noted that the surgical strikes, air strikes, and other operations conducted by India were aimed at eliminating terrorism, and emphasized that the country has now changed—every youth and every citizen should be ready to protect the nation. He added that Kargil Vijay Diwas should inspire patriotism and nationalism among the youth.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *