
మంచు మనోజ్ హీరోగా విప్లవాత్మక పాత్రలో ‘డేవిడ్ రెడ్డి’ – 1897-1922 కాలానికి చెందిన బోల్డ్ రిబెలియన్ స్టోరీ
Manchu Manoj returns in a fierce rebel avatar with ‘David Reddy’ – a powerful historical action drama set between 1897 and 1922
మంచు మనోజ్ తాజా చిత్రం ‘డేవిడ్ రెడ్డి’ పేరుతో అధికారికంగా ప్రకటించబడింది. ఇది చరిత్ర, తిరుగుబాటు, సామాజిక సవాళ్ల మేళవింపుతో కూడిన మాస్ హిస్టారికల్ యాక్షన్ డ్రామా. ఈ సినిమా 1897 నుంచి 1922 కాలం మధ్య సాగుతుంది.
Manchu Manoj’s next project David Reddy has been officially announced with a striking poster. It is a powerful historical action drama that spans the years between 1897 and 1922, blending history, rebellion, and social defiance.
ఈ చిత్రానికి హనుమ రెడ్డి యక్కంటి దర్శకత్వం వహిస్తుండగా, మోతుకూరి భరత్, నల్లగంగుళ వెంకట్ రెడ్డి నిర్మిస్తున్నారు. వెల్వెట్ సోల్ మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోంది.
Directed by Hanuma Reddy Yekanti and produced by Motukuri Bharat and Nallagangula Venkat Reddy under the Velvet Soul Motion Pictures banner, the film marks a new direction in Telugu cinema.
ఈ సినిమా ద్వారా మనోజ్ మనముందు చూడని పవర్ఫుల్ అవతార్‌లో కనిపించనున్నారు. కుల వ్యవస్థ, సామాజిక ఒత్తిళ్లకు వ్యతిరేకంగా బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదిరించిన ఓ తిరుగుబాటు నాయకుడి పాత్రలో మెరిస్తారు.
In this film, Manoj will be seen in a never-before-seen fierce avatar, playing a rebellious character who rises against the oppressive caste system and the British Empire.
టైటిల్ పోస్టర్ బోల్డ్ స్టేట్‌మెంట్ ఇచ్చింది. ‘మద్రాస్ ప్రెసిడెన్సీలో పుట్టాడు, ఢిల్లీలో పెరిగాడు, ఇప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వణికిస్తున్నాడు!’ అనే ట్యాగ్‌లైన్, మనోజ్ ఫేస్‌ను టైటిల్ డిజైన్‌గా మార్చిన యూనిక్ కాన్సెప్ట్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
The title poster itself makes a bold statement. The tagline “Born in Madras Presidency, Raised in Delhi, Now shaking the British Empire!” grabs attention, with the title creatively embedded into Manoj’s face.
ఇదే రోజు 21 ఏళ్ల క్రితం ‘దొంగ దొంగది’తో అరంగేట్రం చేసిన మనోజ్, ఇప్పుడు రెండు దశాబ్దాల తర్వాత ‘డేవిడ్ రెడ్డి’ అనే బ్లాస్టింగ్ ప్రాజెక్ట్‌తో వస్తుండటం అభిమానులకు మరిచిపోలేని మధుర ఘడియ.
Exactly 21 years after his debut with Donga Dongadi, Manoj returns with David Reddy, marking a powerful milestone in his career – a memorable moment for fans and Telugu cinema lovers alike.
ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రం, తెలుగు సినిమా చరిత్రలో ఓ మైలురాయి కావొచ్చని మేకర్స్ భావిస్తున్నారు.
Currently in pre-production, David Reddy is poised to become a landmark film in Telugu cinema, according to the makers.