
మధు శాలిని ప్రెజెంట్స్ రాడికల్ పిక్చర్స్ నిర్మించిన ‘కన్యా కుమారి’ చిత్రం ఆగస్టు 27న థియేటర్లలో విడుదల కానుంది.
Madhu Shalini presents Radical Pictures’ rural love story ‘Kanya Kumari’, releasing in theatres on August 27.
ప్రముఖ నటి మధు శాలిని ప్రెజెంటర్‌గా, రాడికల్ పిక్చర్స్ బ్యానర్‌పై సృజన్ అట్టాడ రచన, దర్శకత్వం, నిర్మాణంలో రూపొందిన ‘కన్యా కుమారి’ చిత్రంలో గీత్ సైని, శ్రీచరణ్ రాచకొండ ప్రధాన పాత్రల్లో నటించారు. వినాయక చవితి సందర్భంగా ఆగస్టు 27న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. రిలీజ్ డేట్ పోస్టర్‌లో శ్రీచరణ్, గీత్ సైనీని ప్రేమగా ఎత్తుకున్న లుక్, ఆమె చేతులకు సీతాకోకచిలుక రెక్కల అలంకరణ ఆకట్టుకుంది.
“అన్ ఆర్గానిక్ ప్రేమ కథ” ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ సినిమా టీజర్ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపింది. రిలీజ్ సమీపిస్తున్న తరుణంలో ప్రమోషన్లు వేగవంతం అవుతున్నాయి. శ్రీకాకుళం బ్యాక్‌డ్రాప్‌లో సహజ వాతావరణంలో నడిచే ఈ లైఫ్‌ఫీల్ కథ, సినిమాటిక్ టచ్‌తో కొత్త అనుభూతిని అందించనుంది. రవి నిలమర్తి సంగీతం, శివ గాజుల-హరి చరణ్ కె సినిమాటోగ్రఫీ, నరేష్ అడుపా ఎడిటింగ్ — ఇవన్నీ కలిపి ఈ ప్రేమకథను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దాయి. పల్లె అందాలు, మధురమైన ప్రేమకథ, పండుగ వాతావరణంతో ‘కన్యా కుమారి’ ఈ సీజన్‌లో ప్రేక్షకుల మనసులను కట్టిపడేయడానికి సిద్ధంగా ఉంది.
Noted actress Madhu Shalini is presenting the rural love story ‘Kanya Kumari’ under the banner Radical Pictures. Written, directed, and produced by Srujan Attada, the film stars Geeth Saini and Sricharan Rachakonda in the lead roles. The makers have announced a grand theatrical release on August 27, coinciding with Vinayaka Chavithi. The release date poster, featuring Sricharan lifting Geeth Saini in a romantic pose with butterfly wings adorning her hands, has caught the audience’s attention.
Touted as an “Unorganic Love Story,” the teaser has already piqued curiosity among viewers. As the release approaches, promotions are set to intensify. Set against the backdrop of Srikakulam’s natural beauty, the film blends a life-like narrative with cinematic finesse. Music by Ravi Nilmarthi, cinematography by Shiva Gajula and Hari Charan K, and editing by Naresh Adupa add to the film’s charm. With rural landscapes, a heartwarming love story, and a festive atmosphere, ‘Kanya Kumari’ is all set to captivate audiences this season.