Lokkoy Mahadev has been unanimously elected as the TDP Mandal President in Arakuvalley…అరకులోయలో టీడీపీ

అరకులోయలో టీడీపీ మండల అధ్యక్షుడిగా లోక్కోయి మహదేవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Lokkoy Mahadev has been unanimously elected as the TDP Mandal President in Arakuvalley.

అరకులోయ నియోజకవర్గ పరిధిలో బుధవారం నిర్వహించిన మండలాధ్యక్ష ఎన్నికల్లో టీడీపీ మండల అధ్యక్షుడిగా పద్మాపురం మాజీ సర్పంచ్ లోక్కోయి మహదేవ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికలు పద్మాపురం పంచాయతీ పరిధిలోని “వి రిసార్ట్స్”లో ప్రశాంతంగా ముగిశాయి.

టీడీపీ బలోపేతం కోసం పలు పంచాయతీ కమిటీల నాయకులు, పార్టీ శ్రేణులు సమావేశమై సామరస్యంగా లోక్కోయి మహదేవ్‌ను ఎంపిక చేశారు. ముంచంగిపుట్టు, డుంబ్రిగూడ, అరకులోయ మండలాల్లో కూడా గ్రామ కమిటీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు స్థానిక నాయకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో అరకు నియోజకవర్గ ఇంచార్జ్, ఆర్టీసీ విజయనగరం రీజినల్ చైర్మన్ సియ్యారి దొన్నుదొర, పార్లమెంట్ పరిశీలకులు హర్షవర్ధన్, నియోజకవర్గ పరిశీలకులు శివరామకృష్ణ రాజు, మండల పరిశీలకులు పండు రాజు, పాంగి రాంబాబు, వంజరి చిరంజీవి నాయుడు సమక్షం ఉన్నారు.

అలాగే, పెదలబుడు మేజర్ పంచాయతీ సర్పంచ్ దాసుబాబు, కొత్తగా ఎన్నికైన మండల అధ్యక్షుడు మహదేవ్, ఇతర పంచాయతీ గ్రామ కమిటీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యకర్తలు, అభిమానులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
The election for the Telugu Desam Party (TDP) Mandal President in the Arakuvalley constituency was held peacefully on Wednesday. During the event held at V Resorts in Padmapuram Panchayat, former sarpanch of Padmapuram, Lokkoy Mahadev, was unanimously elected as the Mandal President.

To strengthen the TDP at the mandal level, local panchayat leaders, committees, and party workers collectively nominated and supported Mahadev. Similar elections were also held for village-level TDP committee presidents and general secretaries across Munchingiputtu, Dumbriguda, and Arakuvalley mandals, where unanimous selections were reported.

The election proceedings were conducted in the presence of TDP Araku constituency in-charge and APSRTC Vizianagaram Regional Chairman Siyyari Donnudora, Araku Parliament observer Harshavardhan, constituency observer Shivarama Krishna Raju, and mandal-level observers Pandu Raju, Pangi Rambabu, and Vanjari Chiranjeevi Naidu.

Leaders including Pedalabudu Major Panchayat Sarpanch Dasubabu, newly elected Mandal President Mahadev, Lakshmi, Bheemaraju, Nagaraju, Rehman, and several other village committee presidents, general secretaries, party workers, and supporters took part in the program.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *