కాంగ్రెస్ నిర్లక్ష్య పాలనతో కుంటుపడిన విద్య – వ్యవసాయం: కేటీఆర్ ఘాటు విమర్శలు

KTR Slams Congress for Crippling Telangana’s Education and Agriculture Systems for Telugu News and English News kindly scroll down

కాంగ్రెస్ నిర్లక్ష్య పాలనతో కుంటుపడిన విద్య – వ్యవసాయం: కేటీఆర్ ఘాటు విమర్శలు

హైదరాబాద్‌ | జూన్ 13:

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్య పాలన వల్ల వ్యవసాయ రంగమే కాకుండా విద్యావ్యవస్థ కూడా తీవ్రంగా దెబ్బతిందని బీఆర్‌ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శించారు.

“వానాకాలం సీజన్ మొదలైందే కానీ రైతు భరోసా విషయంలో పథకం లేదేంటి? పాఠశాలలు తెరుచుకున్నా పాలకుల్లో బాధ్యత కనిపించడంలేదు,” అంటూ ఆయన మండిపడ్డారు.

అరకొర రుణమాఫీ, అస్పష్ట రైతు భరోసా, అందని రైతు బీమా, నిలిచిపోయిన ప్రాజెక్టులు – ఇవన్నీ కాంగ్రెస్ పాలన విఫలాన్ని చూపిస్తున్నాయని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

“పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పండగలా మారిన వ్యవసాయ రంగం, ఏడాదిన్నర కాలంలోనే తిరోగమనంలోకి వెళ్తోంది,” అని విమర్శించారు.

తెలంగాణ విద్యావ్యవస్థ గురించిన అంశాలను ఉద్ఘాటిస్తూ, “వెయ్యికిపైగా సంక్షేమ గురుకులాల ఏర్పాటుతో ఏవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన రాష్ట్ర విద్యా రంగం, ఇప్పుడు అవస్థలు పడుతోంది,” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

KTR: Congress Negligence Has Crippled Telangana’s Agriculture and Education

Hyderabad | June 13:

BRS Working President K.T. Rama Rao (KTR) has strongly criticized the Congress-led state government, alleging that both the agricultural and education sectors are suffering due to its negligence.

“The monsoon season has started, but there’s no proper plan for Rythu Bharosa. Schools have reopened, yet the government remains apathetic,” he said.

He pointed out that the Congress government has failed on multiple fronts — from incomplete loan waivers, unclear farmer support schemes, inaccessible insurance, to stalled irrigation projects.

KTR lashed out, saying:
“What was a celebratory sector under BRS rule for ten years is now regressing under Congress in just over a year.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *