KTR ACB Inquiry Ends, Returns to Telangana Bhavan for Telugu News and English News kindly scroll down

ఫార్ములా-ఈ కేసు: కేటీఆర్ ఏసీబీ విచారణ ముగిసింది
8 గంటల విచారణ అనంతరం తెలంగాణ భవన్‌కు చేరుకున్న కేటీఆర్
హైదరాబాద్, జూన్ 16:
ఫార్ములా-ఈ కార్ రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే అందిన నోటీసుల మేరకు బంజారాహిల్స్‌లోని ఏసీబీ కార్యాలయంలో విచారణ జరిగింది. సుమారు 8 గంటల పాటు అధికారులు ఆయన్ను ప్రశ్నించారు.
విచారణకు ముందు కేటీఆర్ నందినగర్‌లో బీఆర్ఎస్ అధ్యక్షుడితో సమావేశమయ్యారు. అనంతరం తెలంగాణ భవన్ చేరుకొని అక్కడ పార్టీ కీలక నేతలతో చర్చలు జరిపారు. అనంతరం మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ రామచందర్‌రావుతో కలిసి ఏసీబీ కార్యాలయానికి వెళ్లారు.
విచారణ ముగిసిన అనంతరం ఆయన తిరిగి తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. అక్కడ పెద్ద ఎత్తున పార్టీ నేతలు, కార్యకర్తలు స్వాగతం పలికారు. అధికారులు అవసరమైతే మరోసారి విచారణకు రావాలని సూచించినట్టు సమాచారం. అయితే త్వరలో కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.
Hyderabad, June 16:
In the Formula-E car race case, BRS working president KTR appeared before the Anti-Corruption Bureau (ACB) following prior notice. The questioning, which lasted nearly eight hours, was conducted at the ACB office in Banjara Hills.
KTR arrived at the ACB office accompanied by former Additional Advocate General Ramachandra Rao. Before attending the questioning, he met BRS party chief KCR at Nandinagar and later held discussions with key party leaders at Telangana Bhavan. After the inquiry, he returned to Telangana Bhavan, where a large number of BRS leaders and workers welcomed him.
Sources indicate that ACB officials have told KTR he may be called again if necessary. Meanwhile, BRS party sources said that he may address the media soon regarding the inquiry.