కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు: ‘ఏసీబీ విచారణకు రావడంలో ఎలాంటి భయం లేదు’

KTR Attacks Congress Before ACB Probe, Says “No Fear of Jail or Cases : for Telugu News and English New s kindly scroll down

కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు: ‘ఏసీబీ విచారణకు రావడంలో ఎలాంటి భయం లేదు’

హైదరాబాద్, జూన్ 17 :
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం ఏసీబీ విచారణకు హాజరయ్యే ముందు తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. చట్టంపై గౌరవం ఉన్నందువల్లే విచారణకు తిరిగితిరిగి వస్తున్నామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్థులను కక్ష సాధించేందుకు విచారణలను ఉపయోగిస్తోందని ఆరోపించారు.

కేటీఆర్ మాట్లాడుతూ, “ఇది మూడోసారి విచారణకు పిలవడం. మూడుసార్లు కాదు, ముప్పైసార్లు అయినా విచారణకు వస్తాం. ప్రజల తరఫున ప్రశ్నించడం మా బాధ్యత,” అని చెప్పారు. అక్రమ కేసులు పెట్టడం, కమిషన్లు ఏర్పాటు చేయడం ద్వారా మాకు భయపెట్టాలనుకుంటే, అది నిస్సార ప్రయత్నమని ఆయన స్పష్టం చేశారు.

“కేసీఆర్, హరీష్ రావులను కమిషన్ల ముందు కూర్చోబెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారు. అదే తరహాలో నన్ను కూడా ఏసీబీ ముందుకు మళ్లీ మళ్లీ పిలుస్తున్నారు,” అని విమర్శించారు.

జైలు కేసులు తమకు కొత్తకావని, తెలంగాణ ఉద్యమం సమయంలో కూడా జైలుకు వెళ్లిన అనుభవం ఉందన్నారు. “జైలు అంటే భయం లేదు. అవసరమైతే వందసార్లు అయినా జైలుకు వెళ్తాం,” అని కేటీఆర్ తెలిపారు.

తెలంగాణలో జరిగిన ఫార్ములా-ఈ రేసును గుర్తు చేస్తూ, “అందులో తెలంగాణను ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందేలా చేశాం,” అని పేర్కొన్నారు.

కాంగ్రెస్ హామీలపై తీవ్రంగా విమర్శించిన కేటీఆర్, “మీరిచ్చిన 420 హామీలు, దొంగ గ్యారెంటీలు, డిక్లరేషన్లు తీరే వరకు ప్రశ్నిస్తూనే ఉంటాం. ప్రజలందరూ మీ మోసాలను గమనిస్తున్నారు,” అన్నారు.

బీసీ రిజర్వేషన్ల అంశాన్ని ప్రస్తావిస్తూ, “కామారెడ్డి డిక్లరేషన్ లో 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ఇప్పుడు వాటిని విస్మరిస్తున్నారు,” అని మండిపడ్డారు. రైతుబంధును ఎన్నికల సమయంలో మాత్రమే చెల్లిస్తుండటాన్ని, మహిళల భత్యాన్ని నిలిపివేయడాన్ని, ఉద్యోగాల హామీలను నెరవేర్చలేదన్న విషయాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.

“మీరు చెప్పడానికి సమాధానం లేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని స్పష్టంగా కనిపిస్తోంది. ఒకే ఒక్క కేసు కాదు, వెయ్యి కేసులు పెట్టినా మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాం. అవసరమైతే లై డిటెక్టర్ టెస్టుకు సిద్ధంగా ఉన్నాను,” అంటూ కేటీఆర్ తేల్చి చెప్పారు.


🔵 KTR Fires at Congress Before ACB Probe: “No Fear, Will Keep Questioning”

Hyderabad, June 17 (News Pulse):
BRS Working President KTR, before attending the ACB inquiry on Monday, strongly criticised the Congress government, accusing it of using legal systems for political vengeance.

Speaking to the media at Telangana Bhavan, he said, “This is the third time I’m being summoned. Even if it’s thirty times, I’ll attend. We respect the law and will continue to question on behalf of the people.”

He alleged that fake cases and commissions are being used to suppress the opposition. “Calling KCR and Harish Rao to commissions is giving sadistic satisfaction to Congress. They are summoning me again and again,” he said.

KTR clarified that jail threats don’t scare him, recalling his past during the Telangana movement. “Even if I have to go to jail a hundred times, I’ll go,” he said.

Highlighting achievements like the Formula-E race, he said Telangana was placed on the global map due to their efforts.

He came down heavily on Congress for not fulfilling promises. “Your 420 promises and false declarations will be questioned till they’re fulfilled. People are observing your betrayals,” he added.

He criticised the government for ignoring BC reservation pledges, turning Rythu Bandhu into an election-centric scheme, halting women’s allowance, and failing to deliver 2 lakh jobs.

KTR accused the Congress of diversion politics due to lack of answers and challenged them to take a lie detector test.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *