Kodangal Assembly constituency’s historic temples will be developed to reflect the region’s cultural grandeur and traditions, as directed by Chief Minister Revanth Reddy…కొడంగల్ శాసనసభ

Image: Screenshot from ‘ USED FROM HIS X ACCOUNT Official account of CMO Telangana.            ” (used under fair use for reporting)

కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలోని చారిత్రక దేవాలయాలను సాంస్కృతిక వైభవం, సంప్రదాయాల ప్రతిబింబంగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. Kodangal Assembly constituency’s historic temples will be developed to reflect the region’s cultural grandeur and traditions, as directed by Chief Minister Revanth Reddy.

ముఖ్యమంత్రి, కొడంగల్‌లోని శ్రీ మహాలక్ష్మీ వెంకటేశ్వర స్వామి (బాలాజీ) ఆలయం, దౌల్తాబాద్‌లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, కోస్గీలోని శివాలయం, వేణుగోపాల స్వామి ఆలయాల అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. కొడంగల్‌లోని శ్రీ మహాలక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఆరు ఎకరాల విస్తీర్ణంలో టీటీడీ తరహాలో అభివృద్ధి చేసే ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు.

ఆలయ అభివృద్ధి కోసం ప్రాకార మండపం, మాడ వీధులు, భూ వరాహస్వామి దేవాలయం, గర్భగుడి, మహామండప నిర్మాణ డిజైన్లను అధికారులు సమీక్షకు సమర్పించగా, ముఖ్యమంత్రి అనుకూలంగా స్పందించారు.

దౌల్తాబాద్, కోస్గి ఆలయాల అభివృద్ధి డిజైన్లను కూడా పరిశీలించిన సీఎం, రాతి కట్టడాలతో ఆలయాలను అద్భుతంగా తీర్చిదిద్దాలని సూచించారు. సాంప్రదాయ శిల్పకళ, నిర్మాణ వైశిష్ట్యం ప్రతిఫలించేలా పనులు చేయాలని ఆదేశించారు.

ఈ సమీక్ష సమావేశంలో ముఖ్య కార్యదర్శి కె. రామకృష్ణారావు సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Chief Minister Revanth Reddy has directed officials to develop the historic temples of Kodangal Assembly constituency as symbols of the region’s cultural grandeur and traditions.

The Chief Minister reviewed plans for the development of Sri Mahalakshmi Venkateswara Swamy (Balaji) Temple in Kodangal, Sri Venkateswara Swamy Temple in Daulatabad, the Shiva temple in Kosgi, and the Venu Gopala Swamy Temple. He approved proposals to develop the Sri Mahalakshmi Venkateswara Swamy Temple on a six-acre site in the style of the Tirumala Tirupati Devasthanams (TTD).

Officials presented designs for the temple’s prakara mandapam, mada streets, Bhu Varaha Swamy temple, sanctum sanctorum, and maha mandapam, which the Chief Minister welcomed.

He also examined development designs for the Daulatabad and Kosgi temples, instructing officials to build the structures with stone architecture for an impressive and traditional look. He stressed that the work should reflect traditional craftsmanship and architectural heritage.

Chief Secretary K. Ramakrishna Rao and other senior officials participated in the review meeting.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *