
Image: Screenshot from ‘ ” https://www.youtube.com /(used under fair use for reporting)
బనకచర్ల ప్రాజెక్టు ప్రకటనపై తీవ్రంగా స్పందించిన తెలంగాణ మంత్రులు, కృష్ణా–గోదావరి నదులపై రాష్ట్రాలకు వాటాలు నిర్ణయించిన తరువాతే కొత్త ప్రాజెక్టులపై చర్చ జరుగాలని స్పష్టం చేశారు. ఏపీ మంత్రుల వ్యాఖ్యలను నిరసిస్తూ, లోకేష్ ప్రాంతీయతను రెచ్చగొడుతున్నారని విమర్శించారు.
Reacting strongly to Andhra Pradesh ministers’ statements on the Banakacharla project, Telangana ministers asserted that any discussion on new irrigation projects should take place only after resolving the water share allocations between the two states. They slammed Lokesh for inciting regional sentiment through his remarks.
ఆంధ్రప్రదేశ్ మంత్రుల బనకచర్ల ప్రాజెక్టు ప్రస్తావనపై తెలంగాణ మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు గట్టిగా స్పందించారు. తాము బనకచర్ల ప్రాజెక్టును పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని, ముందుగా కృష్ణా, గోదావరి నదుల జలాల అంశంపై స్పష్టత రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. నీటి విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తగవని, తప్పుడు ప్రకటనలు ప్రజలను మభ్యపెడతాయని ఆరోపించారు.
పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, “లోకేష్ ప్రాంతీయతను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు. ముందు నికర, మిగులు, వరద జలాల తేడా తెలిసి మాట్లాడాలి” అని హితవు పలికారు. ఉమ్మడి రాష్ట్రంలో ట్రిబ్యునల్స్ నిర్ణయాల ప్రకారం తెలంగాణకు 967 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్‌కు 531 టీఎంసీలు కేటాయించబడిన నేపథ్యంలో, వాటిని పూర్తిగా వినియోగించిన తర్వాతే వరద జలాల గురించి చర్చకు రావాలని సూచించారు.
“తప్పులపై ప్రజల మద్దతు కోరడం సరికాదు. వాస్తవాలను దాచిపెట్టి, తెలంగాణకు రావాల్సిన నీటి వాటా కోసుకోవడం అన్నదానికి మేము అంగీకరించం,” అని ఆయన అన్నారు. తెలంగాణ హక్కుల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
ఇక మంత్రివర్గ సహచరుడు శ్రీధర్ బాబు మాట్లాడుతూ, “తెలంగాణ ప్రయోజనాలకే మేము కట్టుబడి ఉన్నాం. కృష్ణా–గోదావరి వాటాలు తేల్చిన తరువాతే కొత్త ప్రాజెక్టులపై చర్చ జరగాలి. ఏపీ నేతల ప్రకటనలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు,” అని తేల్చి చెప్పారు.