దీపావళికి కిరణ్ అబ్బవరం ‘కే-ర్యాంప్’ థియేటర్లకు సిద్ధం – ‘రిచెస్ట్ చిల్లర్ గయ్’ గ్లింప్స్ ఆకట్టుకుంటోంది

K-Ramp’ Glimpse Out: Kiran Abbavaram Turns the Coolest Guy on Screen This Diwali

‘K-Ramp’ Glimpse Out: Kiran Abbavaram Turns the Coolest Guy on Screen This Diwali
దీపావళికి కిరణ్ అబ్బవరం ‘కే-ర్యాంప్’ థియేటర్లకు సిద్ధం – ‘రిచెస్ట్ చిల్లర్ గయ్’ గ్లింప్స్ ఆకట్టుకుంటోంది

దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 18న విడుదలకు సిద్ధమవుతున్న “K-ర్యాంప్” మూవీ నుంచి హీరో కిరణ్ అబ్బవరం క్యారెక్టర్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. మాస్‌ అటిట్యూడ్‌తో కూడిన పాత్రలో కనిపించిన ఆయన, ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ హామీ ఇచ్చినట్టైంది.

Ahead of its grand theatrical release on October 18 during Diwali, the glimpse of actor Kiran Abbavaram’s character from the film K-Ramp was unveiled today. Titled ‘The Richest Chiller Guy’, the energetic preview promises full-on entertainment for the audience.


📰 Telugu News Article

సక్సెస్ ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న “K-ర్యాంప్” సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 18న గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఈ సినిమాను హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్లపై నిర్మాతలు రాజేష్ దండ, శివ బొమ్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యుక్తి తరేజా హీరోయిన్‌గా నటిస్తుండగా, జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ రోజు విడుదలైన ‘రిచెస్ట్ చిల్లర్ గయ్’ గ్లింప్స్ లో కిరణ్ అబ్బవరం, కుమార్ అనే మాస్ యూత్‌గా కనిపించారు. చిల్ కావడంలో అతనికి పోటీ లేకుండా కనిపించడంతో పాటు, ఫుల్ ఎనర్జీతో క్యారెక్టర్‌ను ప్రదర్శించారు. ముఖ్యంగా గ్లింప్స్ చివరలో “తెలుగు ప్రేమ కథలతోనే మనకు ప్రాబ్లం.. ఎందుకంటే ఆ సినిమాల్లో ఆంథెటిసిటీ ఉండదు” అన్న డైలాగ్ విశేషంగా ఆకట్టుకుంది.

ఈ గ్లింప్స్ చూస్తే “K-ర్యాంప్” చిత్రం ఓ ఫన్-ఫిల్డ్, మాస్ అండ్ క్లాస్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని స్పష్టమవుతోంది. సినిమాలో నరేష్, సాయి కుమార్, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.


📰 English News Article

Kiran Abbavaram’s upcoming movie K-Ramp is gearing up for a grand theatrical release on October 18, as a Diwali special. The film is jointly produced by Rajesh Danda and Shiva Bomma under Hasya Movies and Rudransh Celluloid banners, with Jain Nani directing and Yukti Thareja playing the female lead.

Today, the makers released a glimpse titled ‘The Richest Chiller Guy’, showcasing Kiran Abbavaram as a stylish youth named Kumar. With his high-energy performance and unbeatable chill attitude, the character instantly grabs attention. The glimpse ends with a striking dialogue: “We hit films watching Malayalam love stories in AMB, but have a problem with Telugu love stories — because they lack authenticity.”

This dialogue stands out as the highlight and hints at the film’s quirky yet emotional tone. From the glimpse, it’s clear that K-Ramp aims to deliver complete entertainment. The cast also includes Naresh, Sai Kumar, and Vennela Kishore in pivotal roles.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *