Karimnagar Municipal Commissioner Praful Desai instructed officials to set up ward offices across all divisions in the city for better local governance and accessibility…కరీంనగర్ నగరపాలక

కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజన్లలో వార్డు కార్యాలయాలను ఏర్పాటు చేయాలని కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ అధికారులకు సూచించారు.

Karimnagar Municipal Commissioner Praful Desai instructed officials to set up ward offices across all divisions in the city for better local governance and accessibility.

కరీంనగర్ నగరపాలక సంస్థ కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ నగరంలోని పలు డివిజన్లను శనివారం సందర్శించారు. 10, 11 డివిజన్‌లలోని వార్డు కార్యాలయాలను తనిఖీ చేసి, వాడకానికి సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. అనవసరంగా నిల్వ చేసిన ఫర్నిచర్‌ను తొలగించాలని సూచించారు. 11వ డివిజన్ పరిధిలోని న్యూ శ్రీనగర్ కాలనీలో అభివృద్ధి చేసిన చిల్డ్రన్స్ పార్క్‌ను పరిశీలించారు. అక్కడ చెడిపోయిన వాటర్ పౌంటెన్, జిమ్ పరికరాలను మరమ్మతు చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.

అలాగే 12వ డివిజన్‌లో వార్డు కార్యాలయ భవనం పనులను, 35వ డివిజన్‌లోని సప్తగిరి కాలనీలో నిర్మిస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్ర అభివృద్ధి పనులను కూడా పరిశీలించారు. మహిళా సంఘ భవనాన్ని సందర్శించిన ఆయన, అక్కడ మరో వార్డు కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు.

ఈ సందర్భంగా ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ, సప్తగిరి కాలనీ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆధునిక సదుపాయాలతో కూడిన సొంత భవనంలో వైద్యశాలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. పనులను త్వరగా పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు.

ఈ కార్యక్రమాల్లో మాజీ కార్పొరేటర్ బుచ్చిరెడ్డి, నగరపాలక అధికారులు పాల్గొన్నారు.

Karimnagar Municipal Commissioner Praful Desai has instructed officials to establish ward offices across all divisions in the city to enhance civic administration and accessibility.

On Saturday, Commissioner Praful Desai visited several divisions under the Karimnagar Municipal Corporation. He inspected ward offices in Divisions 10 and 11 and directed the concerned officials to make them fully operational. He also instructed that unused furniture stored in the offices be removed and the spaces be prepared for active use.

During his visit, Desai inspected the Children’s Park developed by the Municipal Corporation in New Srinagar Colony under Division 11. He ordered engineering officials to repair the damaged water fountain and gym equipment in the park and make them accessible to the public. He also directed that minor repair works inside the park be completed promptly.

In Division 12, he reviewed the ward office building, and in Division 35, he inspected the progress of modernization works at the Primary Health Center being developed in Saptagiri Colony. Desai also visited the local women’s community building and suggested setting up another ward office within the premises to better serve the area.

Speaking on the occasion, Commissioner Desai said that a dedicated urban primary health center with modern facilities is being built to improve healthcare services in Saptagiri Colony. He instructed the contractor to complete the ongoing construction quickly and get it ready for inauguration. He reiterated that all divisions in Karimnagar should have functioning ward offices and directed officials to expedite the process. Specifically, he emphasized activating ward offices in Divisions 11 and 12 as early as possible.

Former corporator Buchireddy and officials from the municipal corporation participated in the inspection visits and discussions.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *