Karimnagar District Collector Pamela Satpati warned of strict action against artificial fertilizer shortages and instructed dealers to follow rules..కరీంనగర్ జిల్లా

కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఎరువుల కృత్తిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫెర్టిలైజర్ దుకాణాలలో నిబంధనలు పాటించాలని ఆమె ఆదేశించారు.
Karimnagar District Collector Pamela Satpati warned of strict action against artificial fertilizer shortages and instructed dealers to follow rules.

కరీంనగర్:
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూరులోని సిఎస్సి విఎల్ఈ, శ్రీరామ ఫెర్టిలైజర్ దుకాణాలను కలెక్టర్ పమేలా సత్పతి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎరువుల నిల్వలు, కొనుగోలు రిజిస్టర్ మరియు స్టాక్ బోర్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సబ్సిడీ ఎరువులను బ్లాక్ మార్కెట్‌కు తరలించడం లేదా నిల్వలను దాచిపెట్టి కృత్తిమ కొరత సృష్టించడం జరుగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

దుకాణదారులు రైతులకు ఇచ్చే ఎరువుల పరిమాణాన్ని రికార్డు చేయాలని, ఎరువులు మరియు విత్తనాల స్టాక్ బోర్డును తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఆమె ఆదేశించారు. రైతుల సమస్యలు వినేందుకు టోల్ ఫ్రీ నెంబర్‌ను డిస్‌ప్లే చేయాలని సూచించారు. వ్యవసాయ అధికారులు నిరంతరం ఫెర్టిలైజర్ దుకాణాలను తనిఖీ చేస్తూ, రైతులకు సరైన అవగాహన కల్పించాలని, అధిక ఎరువుల వాడకంతో నేల స్వభావం దెబ్బతింటుందని రైతులను జాగృతం చేయాలని పమేలా సత్పతి పేర్కొన్నారు. ఈ తనిఖీలలో జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి కూడా పాల్గొన్నారు.
Karimnagar:
District Collector Pamela Satpati conducted surprise inspections on Thursday at CSC VLE and Srirama Fertilizer shops in Algunur village of Thimmapur mandal, Karimnagar district. She checked the fertilizer stocks, purchase registers, and stock boards. Speaking on this occasion, she warned that strict action would be taken if subsidized fertilizers are diverted or sold in the black market.

The Collector instructed shop owners to record the details of the quantity of fertilizers sold to each farmer. She emphasized that a stock board for fertilizers and seeds must be displayed, along with a toll-free number for farmer complaints. Agriculture officers were directed to conduct regular inspections at fertilizer shops and to create awareness among farmers about the dangers of overusing fertilizers, which can harm soil fertility. She also advised educating farmers to use minimal required fertilizer. District Agriculture Officer Bhagyalakshmi accompanied the Collector during the inspections.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *