Political leaders laud ‘Kannappa’ starring Vishnu Manchu – Deputy CM says it’s a milestone film

విష్ణు మంచు నటించిన ‘కన్నప్ప’ సినిమాపై రాజకీయ ప్రముఖుల ప్రశంసలు – మైల్‌స్టోన్ మూవీగా నిలవబోతోందన్న డిప్యూటీ సీఎం
Political leaders laud ‘Kannappa’ starring Vishnu Manchu – Deputy CM says it’s a milestone film
విష్ణు మంచు ప్రధాన పాత్రలో నటించిన ‘కన్నప్ప’ సినిమా ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటూ అన్ని చోట్లా హిట్ టాక్ తెచ్చుకుంది. రోజు రోజుకీ కలెక్షన్లు పెరుగుతున్న నేపథ్యంలో, ఈ సినిమాపై తెలుగు రాష్ట్రాల రాజకీయ ప్రముఖుల దృష్టి పడింది. ఆదివారం రాత్రి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేకంగా ‘కన్నప్ప’ సినిమాను వీక్షించారు. మోహన్ బాబు, విష్ణు కూడా స్పెషల్ స్క్రీనింగ్‌కు హాజరయ్యారు.
Vishnu Manchu’s mythological action epic Kannappa has been receiving widespread positive reviews and houseful shows across regions. As the buzz around the film continues to grow, Telangana’s top political leaders attended a special screening of the film on Sunday night. Deputy Chief Minister Mallu Bhatti Vikramarka, Cinematography Minister Komatireddy Venkat Reddy, and Minister Ponnam Prabhakar watched the film alongside Mohan Babu and Vishnu Manchu.
సినిమా అనంతరం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ – ‘‘ఇది ఊహకు మించి ఉన్న చిత్రం. అర్జునుడిగా, తిన్నడిగా, కన్నప్పగా విష్ణు అద్భుతంగా నటించాడు. కథ, కథనం, విజువల్స్ అన్నీ అత్యద్భుతంగా ఉన్నాయి. ఇది మైల్ స్టోన్ మూవీ అవుతుంది,’’ అని ప్రశంసించారు.
After the screening, Deputy CM Mallu Bhatti Vikramarka said, “Kannappa exceeded expectations. Vishnu excelled in every shade – as Arjuna, Thinnadu, and Kannappa. The story, narration, and visuals are all excellent. This is going to be a milestone film.”
సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ – ‘‘చాలా రోజుల తర్వాత అంతటి గొప్ప సినిమా చూశాను. శివ భక్తుల హృదయాలను తాకేలా తీశారు. మోహన్ బాబు, విష్ణు ఇద్దరికీ అభినందనలు. ఇలాంటి సినిమాలు తరచూ రావాలి’’ అని అభిప్రాయపడ్డారు.
Cinematography Minister Komatireddy Venkat Reddy added, “It’s been a long time since I’ve seen such a powerful film. It connects deeply with Shiva devotees. My compliments to Mohan Babu and Vishnu. We need more such films.”