కాళేశ్వరం వల్లే సాగునీరు.. హరీష్ రావు ప్రజంటేషన్‌ను సిద్దిపేటలో పార్టీ శ్రేణుల వీక్షణ
Kaleshwaram brought irrigation water; Harish Rao’s presentation screened for BRS cadre in Siddipet
కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం ప్రారంభమైన తర్వాతే రాష్ట్ర రైతులకు సాగునీరు అందిందని బీఆర్‌ఎస్ నేతలు స్పష్టం చేశారు. తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజంటేషన్ సందర్భంగా, సిద్దిపేట క్యాంప్ కార్యాలయంలో స్క్రీన్ ఏర్పాటు చేసి పార్టీ నేతలు, శ్రేణులు ప్రత్యక్షంగా చూసారు.
BRS leaders in Siddipet affirmed that irrigation water reached farmers in Telangana only after the construction of the Kaleshwaram project. During Harish Rao’s PowerPoint presentation at Telangana Bhavan, party cadres and local leaders gathered at the Siddipet camp office to watch the live stream.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ప్రజలను దారితప్పించే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని మండిపడ్డారు. కేసీఆర్ హయంలోనే 11 రకాల పెన్షన్లు అమలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో ప్రజలకు ఒక్క మంచి పని కనిపించలేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ శ్రేణులు ఒక్కటై గెలుపొందాలని పిలుపునిచ్చారు.
MLC Yadav Reddy accused the Congress party of indulging in diversion politics and misleading people. He recalled that the KCR government introduced 11 types of pensions and claimed the Congress, in two years of rule, did nothing worthwhile. He urged party members to unite and win the upcoming local body elections.
గజ్వేల్ ఇంచార్జ్ ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ నేతలు కాళేశ్వరం మరియు కేసీఆర్ కుటుంబంపై సోషల్ మీడియాలో అప్రచారం చేస్తోన్నారని తెలిపారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక భూముల ధరలు క్షీణించాయని ఆరోపించారు.
Pratap Reddy, in-charge of Gajwel constituency, criticized Congress leaders for spreading falsehoods on social media about Kaleshwaram and KCR’s family. He claimed Telangana prospered under KCR and that land prices have fallen since the Congress came to power.
హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ఓడితేల సతీష్ మాట్లాడుతూ, ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన ఆరోపణలు అబద్ధాలని అన్నారు. హరీష్ రావు ప్రజంటేషన్ వల్లే కాళేశ్వరం ప్రాజెక్టు విలువ ప్రజలకు తెలిసిందన్నారు. కేసీఆర్ ఇంటింటికీ తాగునీరు, ప్రతి ఎకరానికి సాగునీరు అందించారని గుర్తు చేశారు. గౌరవెల్లి ప్రాజెక్టును 90 శాతం వరకు పూర్తి చేసినప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఎకరానికి కూడా నీరు ఇవ్వలేదన్నారు.
Former Husnabad MLA Odaitela Satish stated that Uttam Kumar Reddy’s allegations were false and that Harish Rao’s presentation revealed the true value of Kaleshwaram. He credited KCR with delivering drinking and irrigation water across the state. He also alleged that while the BRS government completed 90% of the Gouravelli project, the Congress has failed to deliver even one acre of water since coming to power.