Jagan Slams Restrictions on YSRCP Cadre Meets, Questions Chandrababu’s Fear: for Telugu News and English News kindly scroll down

పార్టీ శ్రేణులను పరామర్శిస్తే తప్పా?
జగన్ మండిపాటు, చంద్రబాబుపై తీవ్ర విమర్శలు
అమరావతి, జూన్ 19:
వైఎస్ఆర్ సిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ శ్రేణులను పరామర్శించడానికే తన పర్యటనలకు అడ్డంకులు పెడుతున్నారని మండిపడ్డారు. “పొదిలిలో పర్యటన సమయంలోనూ ఇబ్బందులు సృష్టించారు. ఇప్పుడు చంద్రగిరిలోనూ అదే పరిస్థితి” అని జగన్ ఆరోపించారు.
“40 వేల మందిపై రాళ్లు వేయాలని ప్రయత్నించారని, కానీ రైతులు సంయమనం పాటించారని” అన్నారు. అయినా కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులను ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు.
“ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే భూస్థాపితం చేస్తారా?” అని మండిపడ్డారు. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అరెస్ట్‌ను టాపిక్ డైవర్ట్ చేయడానికే చేశారన్నారు. చెవిరెడ్డి గన్‌మెన్‌ను హింసించారని, ఆ వ్యక్తి స్వయంగా డిజిపి, రాష్ట్రపతికి లేఖలు రాసిన పరిస్థితి ఏర్పడిందన్నారు.
చెవిరెడ్డి కుమారుడిని కూడా ఈ కేసులో ఇరికించే ప్రయత్నం జరుగుతోందన్నారు. లిక్కర్ కేసులో ఏడాది నుండి చెవిరెడ్డి పేరు లేదన్నారు. అయినా ఇప్పుడు కొత్త ఆధారాలు తయారు చేస్తున్నారని విమర్శించారు.
నందిగం సురేష్, వల్లభనేని వంశీలపై అన్యాయంగా కేసులు పెడుతున్నారని, వంశీని రెండు నెలలుగా జైలులో ఉంచారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ను బీహార్ చేయడంలో చంద్రబాబుకు మించిన నాయకుడు లేడన్నారు.
“కర్ఫ్యూలాంటి వాతావరణంలోనే నా పర్యటన జరిగింది. ఇదే ప్రజాస్వామ్యమా?” అని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.
agan Criticizes AP Govt for Stifling YSRCP Activities
Questions Why Cadre Visits Are Being Restricted
Amaravati, June 19:
YSRCP president and former CM Jagan Mohan Reddy strongly criticized the AP government for creating obstructions during his visit to meet party cadre.
He accused the police of attempting to provoke violence during his recent visit to Podili. “There was an attempt to throw stones on 40,000 people, but the farmers remained calm. Yet, false cases were filed,” Jagan said, addressing the media on Thursday.
He questioned why Chief Minister Chandrababu Naidu is afraid of farmers and YSRCP supporters.
Referring to the arrest of Chevireddy Bhaskar Reddy, Jagan claimed it was a deliberate attempt to divert public attention. He said even the gunman of Chevireddy had to write letters to the DGP and President due to police harassment.
He further alleged that Chevireddy’s son is being framed and that fake evidence is being created in liquor cases.
He also criticized the booking of cases against MP Nandigam Suresh and stated that Vallabhaneni Vamsi has been jailed for 60 days without proper cause.
Jagan compared Andhra Pradesh’s governance to that of Bihar, stating that Chandrababu has taken the state back in terms of democracy.
“My tour was conducted under curfew-like conditions. Is this democracy?” he concluded.