Jagan Gears Up with Recalling Chandrababu’s Manifesto

📰 Full Report in Telugu | Telugu News
రీకాలింగ్ చంద్రబాబూస్ మ్యానిఫెస్టో:
కొత్త వ్యూహాలతో జగన్
విజయవాడ, జూన్ 27
వైసీపీ అధినేత వైఎస్ జగన్, . ఇప్పటికే నేతలను నియోజకవర్గాల్లో యాక్టివ్ చేయడానికి దిశానిర్దేశం చేశారు.
కూటమి ప్రభుత్వం పాలన ప్రారంభించి సంవత్సరం కావడంతో, “రీకాలింగ్ చంద్రబాబూస్ మ్యానిఫెస్టో” పేరుతో ప్రజల్లోకి వెళ్లేందుకు జగన్ పార్టీ సిద్ధమవుతోంది. దీనికి అనుబంధంగా వివిధ వర్గాల ప్రజలకు మద్దతుగా వరుస కార్యక్రమాలు చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. మద్యం కేసులో ఇప్పటికే తొమ్మిది మంది అరెస్ట్ అయ్యారు. సిట్ మోహిత్ రెడ్డిని, అనంతరం మిధున్ రెడ్డిని విచారించే అవకాశముంది. ఈడీ కూడా మనీలాండరింగ్ కోణంలో విచారణ కొనసాగిస్తోంది. జగన్ మాత్రం భయపడేది లేదని, అక్రమ కేసులపై జైలు వెళ్ళాల్సివచ్చినా తిరిగి వస్తామని స్పష్టం చేస్తున్నారు. ఏడాది ముందే పార్టీకి ఊపు ఇవ్వాలన్న లక్ష్యంతో కొత్త కార్యక్రమాలు చేపట్టనున్నారు. అయితే ఈ వ్యూహాలు ఎంతవరకు కార్యరూపం దాల్చుతాయన్నది చూడాల్సిన విషయం.