Indian Nurse Nimisha Priya – Yemeni Court Confirms Execution on July 16 | భారత నర్సు నిమిషా ప్రియకు జూలై 16న ఉరిశిక్ష అమలు

🇮🇳🇾🇪 Indian Nurse Nimisha Priya – Yemeni Court Confirms Execution on July 16 | భారత నర్సు నిమిషా ప్రియకు జూలై 16న ఉరిశిక్ష అమలు

యెమెన్‍‌లో ఒక వ్యాపార భాగస్వామిని మత్తుమందుతో హతమార్చిన కేసులో భారత నర్సు నిమిషా ప్రియకు జూలై 16న ఉరిశిక్ష అమలు చేయనున్నట్లు అధికారులు ఆమె కుటుంబానికి అధికారికంగా తెలిపారు. Yemeni President Rashad al-Alimi has approved the execution order, sparking urgent diplomatic efforts by India to save the nurse.

కేరళకు చెందిన నిమిషా ప్రియ 2008లో యెమెన్ వెళ్లి నర్సుగా పని ప్రారంభించింది. 2011లో ఆమె థామస్‌ను వివాహం చేసుకుంది. వ్యాపార నిబంధనల ప్రకారం, విదేశీయులకు స్థానిక భాగస్వామి అవసరం కావడంతో, 2014లో తలాల్ అదిబ్ మహదీతో భాగస్వామిగా క్లినిక్ ప్రారంభించారు.

ఆపై విభేదాలు తలెత్తి, అతనిపై 2016లో నిమిషా ఫిర్యాదు చేసింది. అతడు జైలు నుంచి విడుదలైన తర్వాత ఆమెను బెదిరించడంతో, తన పాస్‌పోర్టును తిరిగి పొందేందుకు అతనికి మత్తుమందు ఇంజెక్ట్ చేసినట్లు ఆరోపణ. ఆ మోతాదు వల్ల మహదీ మరణించాడు. నిమిషా దేశం విడిచి పారిపోవడానికి ప్రయత్నించగా, 2018లో ఆమెను అరెస్టు చేశారు.

భారత విదేశాంగ శాఖ నిమిషా ప్రియ ఉరిశిక్షను ఆపేందుకు యెమెన్ అధికారులతో చర్చలు జరుపుతోంది. కుటుంబంతోపాటు స్థానిక అధికారులతోనూ సంప్రదింపులు కొనసాగిస్తున్నట్లు తెలియజేసింది. Legal and humanitarian appeals are underway, seeking clemency from Yemeni authorities.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *