India’s Fight Against Poverty Becomes a Global Benchmark: 269 Million Lifted in a Decade for English News Kindly Scroll Down

భారతదేశం తీవ్ర పేదరికం నిర్మూలనలో అద్భుతమైన విజయాన్ని సాధించి, ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. వరల్డ్ బ్యాంక్ తాజా నివేదిక ప్రకారం, 2011-12లో 27.1 శాతంగా ఉన్న తీవ్ర పేదరికం రేటు 2022-23 నాటికి కేవలం 5.3 శాతానికి తగ్గింది. దీని ద్వారా సుమారు 26.9 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు.
ఈ పురోగతిని సాధించడం విశేషం, ఎందుకంటే ప్రపంచ బ్యాంక్ తాజాగా రోజుకు 3 డాలర్లు కంటే తక్కువగా ఖర్చు చేయలేనివారిని పేదలుగా పరిగణించే మరింత కఠినమైన కొలమానం తీసుకొచ్చింది (ప్రస్తుతం కొనుగోలు శక్తి సమానతల ఆధారంగా).
ఈ విజయంలో ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ వంటి ఐదు రాష్ట్రాలు కీలక పాత్ర పోషించాయి. 2011-12లో భారతదేశ పేదలలో 65 శాతం మంది ఈ ఐదు రాష్ట్రాల్లో ఉండగా, ఇప్పుడు మొత్తం పేదరిక తగ్గింపులో రెండు మూడవ వంతు వాటా ఆయా రాష్ట్రాలదే.
భారత విజయగాథ ప్రపంచ స్థాయిలోనూ ప్రభావం చూపించింది. వరల్డ్ బ్యాంక్ తాజా మార్గదర్శకాలు తీసుకొచ్చిన తరువాత, ప్రపంచ పేదరిక రేటు 9 శాతం నుంచి 10.5 శాతానికి పెరిగింది. అయినప్పటికీ, భారత్ సాధించిన అభివృద్ధి ఆ గణాంకాలను సమతుల్యం చేయడంలో కీలక పాత్ర పోషించింది.
ఇది ఆర్థిక విధానాలు, సామాజిక పథకాలు, పాలన వ్యవస్థ సమర్థంగా పనిచేస్తే ఎంతటి మార్పు సాధ్యమవుతుందో చాటిచెప్పే ఉదాహరణగా నిలిచింది.
India has recorded a historic reduction in extreme poverty, setting a benchmark for the world. According to the latest World Bank report, the poverty rate in India declined sharply from 27.1% in 2011–12 to just 5.3% in 2022–23, lifting an astonishing 269 million people out of extreme poverty.
This progress comes despite the World Bank adopting stricter poverty standards, now considering people earning less than $3 per day (adjusted for purchasing power parity) as living in extreme poverty—up from the earlier $2.15/day threshold.
The report highlights that five major states—Uttar Pradesh, Bihar, Madhya Pradesh, Maharashtra, and West Bengal—played a crucial role in this transformation. These five states, which once housed over 65% of India’s poorest, now account for nearly two-thirds of the country’s poverty reduction.
India’s success story has not only redefined its own economic and social landscape but also made a global impact. The World Bank adjusted global poverty estimates upward—from 9% to 10.5%—after applying the new benchmarks. Still, India’s progress helped mitigate the global poverty figures significantly.
This achievement underlines the success of India’s economic policies and social welfare schemes, showing how structured governance can uplift millions and inspire the world.