Hasin Jahan once again accused cricketer Mohammed Shami of neglecting his daughter while prioritizing his girlfriends’ children…కూతురిని

Image Source fromhttps://www.google.com  ” (used under fair use for reporting)

కూతురిని పట్టించుకోకుండా, గర్ల్‌ఫ్రెండ్స్ పిల్లలకు ప్రాధాన్యం ఇస్తున్నాడంటూ క్రికెటర్ మహ్మద్ షమీపై మరోసారి ఆరోపణలు చేసింది హసీన్ జహాన్.
Hasin Jahan once again accused cricketer Mohammed Shami of neglecting his daughter while prioritizing his girlfriends’ children.

టీమిండియా మాజీ పేసర్ మహ్మద్ షమీపై సోషల్ మీడియా వేదికగా హసీన్ జహాన్ ఆవేదన వ్యక్తం చేసింది. తమ కూతురు ఐరాను మంచి స్కూల్‌లో చేర్పించేందుకు షమీ సహకరించడం లేదని తెలిపింది. అయితే, అంతర్జాతీయ పాఠశాలలో సీటు దక్కిందని కూడా వెల్లడించింది.

షమీ స్త్రీలోలుడని, అతడు తన గర్ల్‌ఫ్రెండ్స్ పిల్లలకు ఖరీదైన బహుమతులు ఇస్తూ, వారిని ఉన్నత పాఠశాలల్లో చదివిస్తున్నాడని ఆరోపించింది. కానీ తన కూతురి చదువుకు డబ్బులు చెల్లించడం లేదని, పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాడని విమర్శించింది.

‘నా కూతురి తండ్రి బిలియనీర్. అతడు ఉంపుడుగత్తెల పిల్లలను బిజినెస్ క్లాస్‌లో విమానాల్లో పంపేందుకు లక్షల్లో ఖర్చు చేస్తున్నాడు. కానీ తన కూతురి చదువుకు మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదు’ అని హసీన్ జహాన్ తన పోస్ట్‌లో రాసింది.

షమీ–హసీన్ జహాన్‌ల వివాహం 2014లో జరిగింది. 2015లో వారికి ఐరా అనే కూతురు పుట్టింది. అనంతరం దంపతుల మధ్య విభేదాలు తలెత్తి, 2018 నుండి ఇద్దరూ విడిగా జీవిస్తున్నారు. గృహహింస కేసుతో హసీన్ జహాన్ కోర్టును ఆశ్రయించింది. ప్రస్తుతం కేసు న్యాయస్థానంలో కొనసాగుతోంది.

ఇటీవల కోల్‌కతా హైకోర్టు హసీన్ జహాన్, కూతురు ఐరా సంరక్షణ కోసం నెలకు రూ.4 లక్షల భరణం చెల్లించాలని షమీకి ఆదేశాలు జారీ చేసింది.
Cricketer Mohammed Shami has once again come under fire from Hasin Jahan, who accused him of ignoring their daughter while giving more importance to his girlfriends’ children.
Hasin Jahan alleged on social media that Shami is not willing to support their daughter Ayra’s admission into a good school, though she recently secured a seat in an international school.

She claimed that Shami is a womanizer who spends lavishly on his girlfriends and their children, gifting them expensive presents and ensuring they study in reputed schools, while completely neglecting his own daughter. She further stated that he has not even paid for Ayra’s schooling.

“My daughter’s father is a billionaire. He spends lakhs for his girlfriends’ children to travel in business-class flights and study in top schools. But he does nothing for his own daughter’s education and does not even care for her,” Hasin Jahan wrote in her social media post.

Shami married model Hasin Jahan in 2014, and the couple had a daughter, Ayra, in 2015. Later, disputes arose between them, leading to their separation in 2018. Hasin Jahan filed a domestic violence case against Shami, which is still pending in court.

Recently, the Calcutta High Court directed Shami to pay Rs.4 lakh per month as maintenance for Hasin Jahan and their daughter Ayra.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *