Guwahati CM Himanta Biswa Sarma agreed to allot 5 acres of land for a Tirumala temple in Assam. TTD Chairman B.R. Naidu met the CM and formally requested land for the temple…గౌహతిలో తిరుమల

గౌహతిలో తిరుమల శ్రీవారి ఆలయం నిర్మాణానికి ఐదు ఎకరాల స్థలం కేటాయించేందుకు ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ఆమోదం తెలిపారు. టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలుసుకొని స్థలకోరారు.

Guwahati CM Himanta Biswa Sarma agreed to allot 5 acres of land for a Tirumala temple in Assam. TTD Chairman B.R. Naidu met the CM and formally requested land for the temple.

గౌహతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణాన్ని వేగవంతం చేసేందుకు టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మను గౌహతిలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గౌహతిలో ఆలయ నిర్మాణానికి ఐదు ఎకరాల స్థలం కేటాయించవలసిందిగా ఆయన సీఎంను కోరారు.

టీటీడీ విజ్ఞప్తికి స్పందించిన ముఖ్యమంత్రి ఐదు ఎకరాల స్థలం కేటాయిస్తామని హామీ ఇచ్చారు. అస్సాం రాజధానిలో భక్తుల సౌకర్యార్థం శ్రీవారి ఆలయం నిర్మాణానికి అన్ని విధాలుగా సహకరించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం తెలిపారు.

ఈ సందర్బంగా టీటీడీ చైర్మన్ మాట్లాడుతూ, గౌహతిలో శ్రీవారి ఆలయం నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచన మేరకే ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని వివరించారు. ఈ నిర్ణయాన్ని స్వాగతించిన అస్సాం సీఎం, స్వామి వారి ఆలయం ద్వారా హిందూ మత పరిరక్షణకు, ఆధ్యాత్మిక ప్రచారానికి అది మార్గదర్శిగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.

అలాగే, ఈశాన్య భారతంలో భక్తులకు స్వామి వారి దైవ సన్నిధిని చేరువ చేయడానికి ఆలయం కీలకం అవుతుందన్నారు. ఈ సందర్భంగా కామాఖ్య అమ్మవారి ఆలయ విశిష్టతను సీఎం హిమంత వివరించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో అఖిల భారత హిందూ మహాసభ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జీవీఆర్ శాస్త్రి ముఖ్య పాత్ర పోషించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *