Gajwel Police Crack Blind Murder Case, Receive Rewards from Commissioner

గజ్వేల్‌లో వృద్ధురాలి హత్య కేసు ఛేదించిన పోలీసులు – కమిషనర్ నుంచి నగదు రివార్డులు
సిద్దిపేట జిల్లా గజ్వేల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ధర్మారెడ్డిపల్లి గ్రామ శివారులో వృద్ధురాలు నల్ల సత్తవ్వ వ్యవసాయ భూమిలో పనిచేస్తుండగా గుర్తుతెలియని వ్యక్తి ఆమెను హత్య చేశాడు. బంగారం దొంగలించకపోవడంతో కేసు క్లూస్ లేకుండా మిగిలింది. అయినా పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితుడిని పట్టుకొని కేసును విజయవంతంగా ఛేదించారు.
ఈ దర్యాప్తులో గజ్వేల్ ఇన్స్పెక్టర్లు సైదా, ముత్యం రాజు నేతృత్వంలో క్రైమ్ వర్టికల్, ఐటీ సెల్ సిబ్బంది అయిన ఏఎస్ఐ యాదగిరి, కానిస్టేబుళ్లు నరేందర్, వెంకటేష్, రవి, దివ్య, శ్రీకాంత్, రమేష్, సురేందర్, హోంగార్డు నగేష్ లు పాల్గొన్నారు. సీసీ కెమెరాలు, డిజిటల్ ఆధారాలతో నిందితుడిని గుర్తించి అతని వద్ద నుంచి గ్లామర్ బైక్, కొడవలి, బంగారు గొలుసు, చెవికమ్మలు, మొబైల్ స్వాధీనం చేసుకున్నారు.
నిందితుడిని మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం కోమటిపల్లికి చెందిన ఆయుర్వేద బోన్ సెట్టర్ కిచ్చిగారి శివ శంకర్‌గా గుర్తించి అరెస్టు చేసి జ్యుడిషియల్ రిమాండ్‌కు తరలించారు. ఈ కేసును క్లూస్ లేకుండా చేదించిన పోలీసుల సేవలను గుర్తించి కమిషనర్ డాక్టర్ బి. అనురాధ వారిని అభినందిస్తూ నగదు రివార్డులు అందజేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ప్రతి కేసును ఛాలెంజ్‌గా తీసుకొని అంకితభావంతో పనిచేస్తే అధికారులకు గుర్తింపు లభిస్తుందన్నారు. సీసీ కెమెరాలు, టెక్నాలజీ ఆధారంగా నేరాల ఛేదనలో పోలీసులకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. ‘‘నేను సైతం’’ కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా ప్రజలు, వ్యాపారస్తులు పోలీసులకు సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో గజ్వేల్ ఏసీపీ నరసింహులు, ఇన్స్పెక్టర్లు కిరణ్, శ్రీధర్ గౌడ్, మల్లేశం గౌడ్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Gajwel police in Siddipet district solved a blind murder case where an unidentified person killed an elderly woman named Nalla Sattavva while she was working in an agricultural field near Dharmareddypally. Although no gold was stolen, making the case more difficult, the police used technological clues to identify and arrest the accused.
The investigation was led by Gajwel Inspectors Saida and Muthyam Raju along with the Crime Vertical and IT Cell team. Officers ASI Yadagiri, constables Narender, Venkatesh, Ravi, Divya, Srikanth, Ramesh, Surender, and home guard Nagesh used CCTV footage and digital evidence to catch the criminal. A Glamour bike, sickle, gold chain, earrings, and a mobile phone were recovered from the accused.
The accused was identified as Kichchigari Shiva Shankar, an Ayurvedic bone setter from Komatipally village, Veldurthi mandal, Medak district. He was arrested and remanded to judicial custody. Police Commissioner Dr. B. Anuradha appreciated the swift and dedicated efforts of the team and rewarded them with cash prizes at the Commissioner’s office.
The Commissioner stated that solving such challenging cases with commitment brings recognition to the police force. She emphasized the importance of CCTV technology and urged the public and business community to participate in the “Nenu Saitham” community policing program by installing surveillance cameras.
ACP Narasimhulu, Inspectors Kiran, Sridhar Goud, Mallesham Goud, and other police staff participated in the event.