
Image: Screenshot from ‘ https://www.google.com/ ” (used under fair use for reporting)
18 నుంచి 59 ఏళ్ల వయస్సు గల తెలంగాణ రైతులు రైతు బీమా పథకానికి ఆగస్టు 13లోపు దరఖాస్తు చేసుకోవాలి. పథకం 2025-26 సంవత్సరం ఆగస్టు 14 నుంచి ప్రారంభమవుతుంది.
Farmers in Telangana aged 18 to 59 must apply for the Rythu Bima scheme by August 13, with the 2025-26 policy year starting from August 14.
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతిష్ఠాత్మక రైతు బీమా పథకానికి కొత్త దరఖాస్తుల గడువును వ్యవసాయ శాఖ అధికారులు ఆగస్టు 13గా నిర్ణయించారు. అర్హులైన ప్రతి రైతు తమ దరఖాస్తులను స్థానిక వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) వద్ద సమర్పించాలి. ఈ పథకం కింద, రైతు మరణిస్తే — సహజ మరణమైనా, ప్రమాదవశాత్తూ అయినా — కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థిక సహాయం అందజేయబడుతుంది.
ఈ పథకానికి అర్హులు కావడానికి రైతు వయసు 18 నుంచి 59 ఏళ్ల మధ్య ఉండాలి (1966 ఆగస్టు 14 నుండి 2007 ఆగస్టు 14 మధ్య జననం). దరఖాస్తు చేసుకోవడానికి పట్టాదారు పాస్ బుక్, ఆధార్ కార్డు, నామినీ ఆధార్ కార్డు, రైతు బీమా దరఖాస్తు ఫారం సమర్పించాలి. కొత్తగా పాస్ బుక్ పొందిన వారు, లేదా గతంలో ఉన్నప్పటికీ పథకంలో చేరనివారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.
రైతులపై ఎటువంటి ప్రీమియం భారమూ లేకుండా ప్రభుత్వం నేరుగా ఎల్ఐసి (LIC)కి చెల్లిస్తోంది. 2018 ఆగస్టు 14న ప్రారంభమైన ఈ పథకం, ఇప్పటి వరకు వేల కుటుంబాలకు ఆర్థిక భరోసా అందించింది. రాష్ట్రంలో దాదాపు 76 లక్షల మంది పట్టాదారు పాస్ బుక్ కలిగిన రైతులు ఉన్నారు.
Farmers in Telangana aged between 18 and 59 must apply for the Rythu Bima scheme by August 13, with the 2025–26 insurance year beginning on August 14.
The Agriculture Department has set August 13 as the last date for new applications to the prestigious Rythu Bima scheme implemented by the Telangana government. Eligible farmers must submit their applications to their local Agriculture Extension Officer (AEO). Under this scheme, if a registered farmer dies — whether due to natural causes or an accident — their family will receive ₹5 lakh in financial assistance.
To be eligible, the farmer’s age must be between 18 and 59 years (born between August 14, 1966, and August 14, 2007). Applicants must submit a copy of their Pattadar Passbook, Aadhaar card, nominee’s Aadhaar card, and the Rythu Bima application form. Farmers who have recently obtained a Pattadar Passbook, or those who had one earlier but did not join the scheme, can take advantage of this opportunity.
The government pays the insurance premium directly to LIC without imposing any financial burden on farmers. Launched on August 14, 2018, the scheme has provided financial support to thousands of families. There are about 76 lakh farmers in the state who hold Pattadar Passbooks.