
గంజాయి నిర్మూలనలో జిల్లాలో పోలీసుల అపూర్వ కృషికి డీజీపీ రివార్డు ప్రశంసలు
జిల్లాలో గంజాయి రవాణా, నిల్వ, వినియోగంపై కొనసాగుతున్న పోలీసుల కఠిన చర్యలకు గుర్తింపుగా తెలంగాణ నార్కోటిక్ బ్యూరో డీజీపీ సందీప్ శాండిల్య నగదు రివార్డులు ప్రకటించారు. జిల్లాను గాంజా రహితంగా మార్చే లక్ష్యంతో పోలీసుల చర్యలు ప్రశంసించదగ్గవి.
జగిత్యాల జిల్లా పోలీసుల గంజాయి నిర్మూలనలో తీసుకుంటున్న చర్యలు రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందాయి. అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న వారిపై ఆకస్మిక దాడులు, అరెస్టులు, స్వాధీనపరచిన మాదకద్రవ్యాల నిర్వహణలో జిల్లా పోలీసులు చూపిన నిబద్ధతను డీజీపీ సందీప్ శాండిల్య ప్రత్యేకంగా అభినందించారు.
ఈ సందర్భంగా బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ పోలీస్ అధికారులకు, సిబ్బందికి నగదు రివార్డులు అందజేశారు.
గంజాయి నిర్మూలనలో కీలకంగా వ్యవహరిస్తున్న పోలీసులకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసిన ఎస్పీ అశోక్ కుమార్, రాబోయే రోజుల్లో మరింత కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్క పోలీస్ అధికారికీ, సిబ్బందికీ గాంజా నిర్మూలన లక్ష్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
District Police Commended for Outstanding Work in Ganja Eradication
Continuous surveillance and raids on ganja trafficking, storage, and usage in the district
Jagtial:
District police have undertaken strong enforcement efforts against the transportation, storage, and use of illegal narcotic substances like ganja. Their strategy of sudden raids and targeted arrests has resulted in significant drug seizures.
Recognizing these achievements, Telangana Narcotic Bureau DGP Sandeep Shandilya personally appreciated the district police and announced cash rewards for the personnel involved.
During a program held on Wednesday at the district police office, Jagtial SP Ashok Kumar distributed these cash rewards to officials and staff from respective police stations.
Speaking on the occasion, SP Ashok Kumar praised the officers who played a key role in curbing ganja trafficking. He commended their continuous surveillance efforts and strict actions. He urged the police force to continue working rigorously with the goal of making the district completely ganja-free.