District Collector Koya Sri Harsha instructed officials to complete the critical care unit works at Godavarikhani General Hospital by August 15…ఆగస్టు 15 నాటికి

ఆగస్టు 15 నాటికి గోదావరిఖని జనరల్ ఆసుపత్రిలో క్రిటికల్ కేర్ విభాగం పనులు పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అధికారులను ఆదేశించారు.

District Collector Koya Sri Harsha instructed officials to complete the critical care unit works at Godavarikhani General Hospital by August 15.

రామగుండం నగరంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష విస్తృత పర్యటన చేపట్టారు. గోదావరిఖని జనరల్ ఆసుపత్రి, తహసిల్దార్ కార్యాలయం, మున్సిపల్ కార్యాలయాలను పరిశీలించారు. ఆసుపత్రిలో కొత్త క్రిటికల్ కేర్ భవనం పనులను పరిశీలించి, ఆగస్టు 15 లోగా పూర్తి చేసి వినియోగానికి అందించాలని ఆదేశించారు. గైనిక్ పోస్ట్ ఆపరేటివ్ వార్డు, ఎస్‌ఎన్‌సీయూ వార్డు, ఆర్థోపెడిక్ మరియు జనరల్ సర్జరీ ఓపి విభాగాలను పరిశీలించారు. అవసరమైన సిబ్బంది నియామకం జరిపి రోగులకు ఇబ్బందులు లేకుండా చూడాలని అన్నారు.

తహసిల్దార్ కార్యాలయంలో భూ భారతి పెండింగ్ దరఖాస్తులను పరిశీలించిన కలెక్టర్, చట్ట నిబంధనల ప్రకారం భూ సమస్యలు పరిష్కరించాలని సూచించారు. రోజువారీగా నిర్ణీత సంఖ్యలో దరఖాస్తులను డిస్పోస్ చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని పేర్కొన్నారు.

మున్సిపల్ కార్యాలయంలో నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించి, వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ పర్యటనలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. దయాల్ సింగ్, డా. రాజు, తహసిల్దార్ ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

On Friday, District Collector Koya Sri Harsha toured Ramagundam city extensively, inspecting the Godavarikhani General Hospital, Tahsildar office, and Municipal office. He reviewed the construction of the new critical care unit and instructed that the works be completed and handed over by August 15. He inspected the gynecology post-operative ward, SNCU ward, orthopedic, and general surgery OP departments, emphasizing the deployment of sufficient staff to avoid inconvenience to patients.

At the Tahsildar office, he reviewed pending land-related applications under Bhumi Bharati and directed that issues be resolved as per legal provisions. He advised preparing a plan to dispose of a fixed number of applications daily.

In the municipal office, he reviewed the progress of developmental works within the corporation limits and ordered their speedy completion. Hospital superintendent Dr. Dayal Singh, Dr. Raju, Tahsildar Eshwar, and others accompanied him during the tour.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *