Director Rajamouli seems to be planning a surprise glimpse from SSMB29 on Mahesh Babu’s birthday, heightening expectations around the pan-world action-adventure.

SSMB29 నుంచి గ్లింప్స్‌కు రంగం సిద్ధమా..? మహేష్ బర్త్‌డేకు రాజమౌళి సర్‌ప్రైజ్ ఇవ్వనున్నట్టే!
Director Rajamouli seems to be planning a surprise glimpse from SSMB29 on Mahesh Babu’s birthday, heightening expectations around the pan-world action-adventure.

సూపర్ స్టార్ మహేష్ బాబు, ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ యాక్షన్ అడ్వెంచర్ SSMB29పై అంచనాలు గగనాన్నంటుతున్నాయి. జక్కన్న తాజాగా షూటింగ్ వాయిదా వేసి, కీలక సన్నివేశాలను మళ్లీ మాడిఫై చేస్తున్నట్లు సమాచారం. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రతి సీన్‌ పరిపూర్ణంగా ఉండేలా రాజమౌళి సమయం తీసుకుంటున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ.

మహేష్ బాబు తన ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టి, న్యూలుక్ కోసం హార్డ్ వర్క్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఓ డ్యాన్స్ సీక్వెన్స్ కోసం రిహార్సల్స్‌లో తీరిగ్గా పాల్గొంటున్న మహేష్, ఈ సినిమాలో పూర్తి స్థాయిలో మేకోవర్‌ చూపించనున్నాడు. టాలీవుడ్‌ను దాటి హాలీవుడ్ స్థాయికి వెళ్లే ఈ ప్రాజెక్ట్ బడ్జెట్ దాదాపు వెయ్యి కోట్లుగా భావిస్తున్నారు. హాలీవుడ్ టెక్నీషియన్స్, నటీనటులు కూడా ఈ ప్రాజెక్టులో భాగం కానున్నారు.

అడవుల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ప్రాజెక్ట్‌ను మొదట కెన్యాలో ప్లాన్ చేసినా, అక్కడి భద్రతా సమస్యల కారణంగా ఆ షెడ్యూల్ రద్దయినట్లు సమాచారం. అయితే, తాజాగా వైరల్ అవుతున్న వార్తల ప్రకారం… మహేష్ బాబు బర్త్‌డే సందర్భంగా ఆగస్టు 9న SSMB29 గ్లింప్స్ విడుదల కానుందని టాక్. ఇది అధికారికంగా ధృవీకరించాల్సి ఉన్నప్పటికీ, అభిమానుల్లో భారీ స్థాయిలో ఉత్సాహం నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *