దేవరయాంజాల్ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ల పంపిణీ…

Exam Pads Distributed to Class 10 Students

శామీర్‌పేట్ మండలం దేవరయాంజాల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సభ నిర్వహించి పరీక్ష ప్యాడ్లు పంపిణీ చేశారు. A farewell programme was organised for Class 10 students at the Zilla Parishad High School in Devarayanzal, Shamirpet mandal, where exam pads and study materials were distributed.

శామీర్‌పేట్ మండలం దేవరయాంజాల్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పరీక్షల కోసం అవసరమైన పరీక్ష ప్యాడ్లు అందజేశారు.

A farewell meeting for Class 10 students was held on Wednesday at the Zilla Parishad High School in Devarayanzal village of Shamirpet mandal. During the programme, exam writing pads were distributed to students preparing for the upcoming board examinations.

ఈ సందర్భంగా మాట్లాడిన పలువురు విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని జీవితంలో ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. రాబోయే బోర్డు పరీక్షలను శ్రద్ధగా రాసి ఉత్తమ ఫలితాలు సాధించి పాఠశాలకు, తల్లిదండ్రులకు మరియు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ప్రోత్సహించారు.

Speakers at the event advised students to study with discipline and determination to achieve higher goals in life. They encouraged the students to write the upcoming board examinations with focus and secure good results, bringing recognition to their school, parents and village.

గత పది సంవత్సరాలుగా బర్రెంకబాయి శ్రావంత్ రెడ్డి తన తండ్రి బర్రెంకబాయి దేవేందర్ రెడ్డి జ్ఞాపకార్థం ఈ పాఠశాలలోని 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పెన్నులు, పెన్సిల్లు మరియు జ్యామెట్రీ సెట్లు పంపిణీ చేస్తూ వస్తున్నారు. ఈ ఏడాది కూడా అదే విధంగా విద్యార్థులకు అవసరమైన విద్యా సామగ్రిని అందజేశారు.

For the past ten years, Barrenkabai Shravanth Reddy has been distributing exam pads, pens, pencils and geometry sets to Class 10 students of the school in memory of his father Barrenkabai Devender Reddy. This year too, the required study materials were provided to the students.

ప్రతి సంవత్సరం విద్యార్థులను ప్రోత్సహిస్తూ సహాయం అందిస్తున్నందుకు పాఠశాల యాజమాన్యం బర్రెంకబాయి శ్రావంత్ రెడ్డిని శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపింది.

The school management felicitated Barrenkabai Shravanth Reddy with a shawl in appreciation of his continued support and encouragement to students.

అదే కార్యక్రమంలో 10వ తరగతి విద్యార్థులకు హాల్ టికెట్లు కూడా అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ఆర్టీఏ సభ్యుడు జైపాల్ రెడ్డి, రామాలయం మాజీ ధర్మకర్త పట్నం నర్సింహ్మారెడ్డి, సామాజిక సేవకుడు బర్రెంకబాయి శ్రావంత్ రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బాలేష్, ఉపాధ్యాయులు ప్రశాంత్ నాయక్, రమేశ్ చంద్ర, శ్రీనివాస్, శశిరేఖ, హేమలత, మంజులత, నిర్మల, జ్యోతి, నాగలక్ష్మి, నాగమణి తదితరులు పాల్గొన్నారు.

Hall tickets were also distributed to Class 10 students during the programme. District RTA member Jaipal Reddy, former Ramalayam trustee Patnam Narasimhareddy, social worker Barrenkabai Shravanth Reddy, headmaster Balesh and teachers Prashanth Nayak, Ramesh Chandra, Srinivas, Shashirekha, Hemalatha, Manjulatha, Nirmala, Jyothi, Nagalakshmi and Nagamani attended the event.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *