ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ వివాదం: మాధవీలత స్పందన…

Delhi Airport Row: Madhavi Latha Reacts

ఢిల్లీ విమానాశ్రయంలోని మహిళల ప్రార్థనా గదిలో జరిగిన ఘటనపై రాజకీయ వివాదం చెలరేగగా, పబ్లిక్ ప్రార్థనా స్థలం అందరికీ సమానమని మాధవీలత స్పష్టం చేశారు.
A controversy erupted over an incident at Delhi airport’s women’s prayer room, with Madhavi Latha asserting that public prayer spaces are open to all.

ఢిల్లీ: Indira Gandhi International Airportలోని మహిళల ప్రార్థనా గదిలో జరిగిన ఘటనపై సోషల్ మీడియాలో విస్తృత చర్చ కొనసాగుతోంది. బీజేపీ మహిళా నేత కొంపెల్ల మాధవీలత అక్కడ ముస్లిం మహిళలు నమాజ్ చేస్తున్న సమయంలో దుర్గాస్తుతి పఠించడం వివాదాస్పదమైంది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో, ఇతర మతస్థులను అసౌకర్యానికి గురిచేసేలా ప్రవర్తించారంటూ విమర్శలు వెల్లువెత్తాయి.

ఈ ఘటనపై నెటిజన్లలో విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన చర్యగా అభివర్ణిస్తుండగా, మరికొందరు ప్రజా ప్రదేశంలో ఎవరికైనా తమ మతాచారాలు నిర్వహించే హక్కు ఉంటుందని వాదిస్తున్నారు.

విమర్శలకు స్పందించిన మాధవీలత ఓ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఎయిర్‌పోర్టులోని ప్రార్థనా స్థలం పబ్లిక్ ప్రాపర్టీ అని, అది ఎవరి వ్యక్తిగత స్థలం కాదని పేర్కొన్నారు. భారతదేశం లౌకిక ప్రజాస్వామ్య దేశమని, అందరికీ సమాన హక్కులు ఉన్నాయని అన్నారు. విదేశాల్లో విమానాల్లోనే ప్రార్థనలు జరుగుతాయని, మక్కా వంటి ప్రదేశాల్లో కూడా వీడియోలు తీస్తారని, అలాంటప్పుడు ఇక్కడ ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని ప్రశ్నించారు.

ఈ ఘటనకు ముందు కూడా మాధవీలత వివిధ చర్యలతో వార్తల్లో నిలిచారు. గతంలో ఎన్నికల ప్రచారం సమయంలో చేసిన కొన్ని చర్యలు, అలాగే మతపరమైన సందర్భాల్లో తీసుకున్న నిర్ణయాలు కూడా వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే.

Delhi: A controversy has been triggered at Indira Gandhi International Airport after BJP leader Kompella Madhavi Latha recited Durga stuti in a women’s prayer room while Muslim women were offering namaz. Videos of the incident went viral, drawing criticism from several quarters.

Opinions on social media remain divided. While some users alleged that the act was intended to provoke or disturb others, others argued that individuals have equal rights to practice their religion in public spaces.

Responding to the criticism, Madhavi Latha stated in an interview that the prayer room at the airport is a public space and not exclusive to any group. She emphasized that India is a secular democracy where everyone has equal rights. She also cited examples of public prayers in flights and religious sites abroad, questioning the selective criticism.

The leader has been in the news earlier as well for controversial actions during political campaigns and religious events.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *