Congress staging fake protests on BC reservations; BJP misleading people, says MLC Kavitha..బీసీ రిజర్వేషన్లపై

బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ డ్రామాలు, బీజేపీ మోసాలు – దిల్లీ ధర్నాలపై ఎమ్మెల్సీ కవిత కౌంటర్
Congress staging fake protests on BC reservations; BJP misleading people, says MLC Kavitha

బీసీలకు 42% రిజర్వేషన్ల విషయంలో ముస్లింలు లేకూడదంటూ బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని, దిల్లీలో ధర్నాలు పెట్టి ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తోందని ఎమ్మెల్సీ కవిత అన్నారు.

MLC Kavitha alleged that the Congress is enacting a political drama in Delhi in the name of protests to mislead people regarding the BC reservations bill. She also slammed BJP for its double standards on BC reservations, citing that leaders like Bandi Sanjay have consistently opposed the inclusion of Muslims.

బుధవారం బంజారాహిల్స్‌లో జాగృతి ఫౌండేషన్ కార్యాలయంలో జయశంకర్ జయంతిని, తెలంగాణ జాగృతి వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని జెండా ఆవిష్కరించిన అనంతరం కవిత మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అన్ని పార్టీలు ‘జై తెలంగాణ’ నినాదం చేసినా, ఇప్పుడు సీఎం రేవంత్ ఎందుకు ఆ నినాదాన్ని చెప్పడం లేదని ప్రశ్నించారు.

Speaking at the Telangana Jagruthi Foundation Day event, Kavitha questioned why current CM Revanth Reddy isn’t chanting “Jai Telangana” like other leaders did during the Telangana movement. She recalled that Telangana Jagruthi always followed the path of KCR and honored the ideology of Prof. Jayashankar.

బీసీల కోసం తమ పార్టీ 72 గంటల దీక్షకు పూనుకున్నా కోర్టు అనుమతి రాలేదని, కానీ కాంగ్రెస్ మాత్రం దిల్లీలో ‘దొంగ దీక్ష’లు చేస్తోందని మండిపడ్డారు. బీసీల కోసం చిత్తశుద్ధితో పని చేయాలంటే డిల్లీలో నాటకాలు కాదు, నిజమైన కార్యాచరణ కావాలని సూచించారు.

Kavitha said Telangana Jagruthi was denied permission for a 72-hour protest in Hyderabad, while Congress is doing staged protests in Delhi. She urged for sincere political efforts instead of theatrical displays.

తమకు అన్ని వర్గాల మద్దతు లభిస్తోందని, జాగృతి కార్యాచరణ సిద్ధమవుతోందని స్పష్టం చేశారు. బీసీల హక్కుల కోసం రాష్ట్రపతిని కలసేలా అఖిలపక్షాన్ని డిల్లీకి తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు.

Kavitha emphasized that Jagruthi is receiving support across communities and is ready with an action plan. She demanded an all-party delegation to meet the President regarding BC reservations.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *