తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో సీఎం రేవంత్ స్పష్టమైన సందేశం — మహిళా శక్తి, రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

CM Revanth Reddy Announces New Airports, QR Cards & Reforms on Telangana Day for English News kindly Scroll Down

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో సీఎం రేవంత్ స్పష్టమైన సందేశం — మహిళా శక్తి, రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

హైదరాబాద్, జూన్ 2:
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ వేదికగా ఘనంగా నిర్వహించిన వేడుకల్లో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పునఃవ్యవస్థీకరించడంపై ప్రభుత్వ తపనను వివరించారు.

“తెలంగాణ వచ్చాక పదేళ్లలో అధికారంలోకి వచ్చినప్పుడు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నది. ఇప్పుడు అన్నీ రంగాలలో సమతుల్యత కోసం కృషి చేస్తున్నాం,” అని సీఎం పేర్కొన్నారు.

మహిళల అభ్యున్నతికి అధిక ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం, మహిళా సంఘాలకు క్యూఆర్ కోడ్ కలిగిన కార్డులు ఇవ్వనుందని తెలిపారు. ఈ కార్డుల ద్వారా ఉచిత ఆరోగ్య పరీక్షలు అందే విధంగా కొత్త పథకం రూపుదిద్దుకుంటోందన్నారు.

రైతుల రుణ మాఫీ, యువతకు నైపుణ్యాలు అందించే ‘యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ’, సివిల్స్ ఎంపికైన విద్యార్థులకు ₹1 లక్ష ప్రోత్సాహం, అన్నీ ప్రజాకేంద్రిత పాలనకే నిదర్శనమని స్పష్టంచేశారు.

అంతేగాక, రాష్ట్రంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టు ఒక్కటే ఉండటాన్ని దృష్టిలో ఉంచుకుని, వరంగల్ మరియు ఆదిలాబాద్ లో 2 కొత్త విమానాశ్రయాల నిర్మాణానికి కేంద్రం అనుమతులు ఇచ్చిందని ముఖ్యమంత్రి ప్రకటించారు. త్వరలో నిర్మాణం ప్రారంభమవుతుందని తెలిపారు.

CM Revanth Reddy Highlights Telangana’s Vision at Formation Day Celebrations

Hyderabad, June 2:
On the occasion of Telangana Formation Day, Chief Minister Revanth Reddy addressed the state at a grand ceremony held at Parade Grounds, Secunderabad. He outlined the government’s reform efforts and reaffirmed its commitment to women empowerment and farmer welfare.

“When the Congress government assumed office a decade after Telangana’s formation, the state’s economy was in disarray. We are steadily bringing balance and accountability,” he said.

He announced that women’s self-help groups would receive QR code-enabled health cards, allowing free medical tests under a soon-to-be-launched health scheme.

Other key highlights include:

  • ₹2 lakh farm loan waivers already implemented
  • ₹1 lakh incentive for candidates selected in Civil Services
  • Establishment of Young India Skill University to boost youth employability

CM Revanth also made a significant announcement — new airports will soon come up in Warangal and Adilabad, with central approval secured to supplement Shamshabad’s sole facility.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *