ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ మాన్యుఫాక్చరింగ్ పాలసీ 4.0 అంశంపై ముఖ్యమంత్రి నాయుడు సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష జరిపారు – పరిశ్రమల ప్రోత్సాహంపై కీలక దిశానిర్దేశం చేశారు.

Andhra Pradesh CM Chandrababu Naidu today held a high-level review at the Secretariat on the Electronics Component Manufacturing Policy 4.0, outlining key directions to boost the sector.


ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తాజాగా ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ మాన్యుఫాక్చరింగ్ పాలసీ 4.0పై సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సమావేశంలో పరిశ్రమలు, ఐటీ, వాణిజ్య శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ సమీక్ష సందర్భంగా సీఎం మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ఎదగాలన్నది ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. పాలసీ 4.0 ద్వారా మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేందుకు మరియు ఉద్యోగావకాశాలు సృష్టించేందుకు దోహదపడేలా దిశానిర్దేశం చేశారు.

పరిశ్రమలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, స్పెషల్ జోన్‌ల ఏర్పాటు, స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాల వ్యవస్థపై ప్రధానంగా చర్చ జరిగింది. టెక్నాలజీ ఆధారిత పరిశ్రమలకు ఎలాంటి ఉత్పాదన, ఎగుమతుల ప్రోత్సాహాలు ఇవ్వాలో కూడా ఈ సమీక్షలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

పాలసీ రూపకల్పన, అమలులో పారదర్శకత ఉండాలని… కేంద్ర ప్రభుత్వం విధానాలకు అనుగుణంగా రాష్ట్ర విధానాన్ని తీర్చిదిద్దాలని అధికారులకు సీఎం ఆదేశించారు.


Andhra Pradesh Chief Minister Chandrababu Naidu held a high-level review meeting today at the Secretariat regarding the proposed Electronics Component Manufacturing Policy 4.0. Senior officials from Industries, IT, and Commerce departments were present.

During the meeting, the Chief Minister emphasized that the government’s vision is to position Andhra Pradesh as a major electronics manufacturing hub in India. He directed officials to prepare a forward-looking policy that attracts investments and generates large-scale employment.

Discussions were held on creating necessary infrastructure, establishing dedicated industrial zones, and strengthening skill development centers to support the electronics sector. The meeting also covered proposed incentives for production and exports by technology-based industries.

Naidu instructed officials to ensure transparency in policy formulation and alignment with central government initiatives to maximize benefits for the state.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *