
“తోక జాడించే వారి తోకలు కత్తరిస్తా…” – జమ్మలమడుగులో సీఎం చంద్రబాబు
CM Chandrababu warns political rivals in Jammalamadugu, surprises public with an auto ride
జమ్మలమడుగులో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యర్థులపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ, పేదల ఇంటికెళ్లి మమేకమయ్యారు. త్వరలో కడప ఉక్కు ప్లాంట్ నిర్మాణం ప్రారంభమవుతుందని ప్రకటించారు.
During his tour in Jammalamadugu, Chief Minister Chandrababu Naidu made sharp remarks against political opponents and connected directly with the public by visiting pension beneficiaries. He also announced that the Kadapa steel plant would be launched soon.
శుక్రవారం కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో పర్యటించిన సీఎం చంద్రబాబు, “తోక జాడించే వారి తోకలు కత్తరిస్తా” అంటూ తీవ్రంగా స్పందించారు. వైసీపీ వితండవాద రాజకీయాలు చేస్తుందని, మహిళా ఎమ్మెల్యేలను దూషించిన వారిని జగన్ పరామర్శించడం అనైతికమని విమర్శించారు. అలాంటి నాయకులు రాష్ట్రానికి అవసరమా? అని ప్రశ్నించారు.
అంతకుముందు ఎలిప్యాడ్ నుండి ఆటోలో ప్రయాణించి ప్రజలను ఆశ్చర్యపరిచిన సీఎం, తర్వాత లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్ స్వయంగా అందించారు. వితంతువుల కుటుంబాలతో మాట్లాడి వారి పరిస్థితులు తెలుసుకున్నారు.
పెదవారికి ప్రయోజనం కలిగించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి రూ.32,146 కోట్ల పెన్షన్లు ఇస్తోందని పేర్కొన్నారు. “ఇంత గొప్ప కార్యక్రమం ఇంకేదైనా ఉందా?” అని ప్రశ్నించారు. మహిళలకు ‘వందనం’ పథకం ద్వారా పెద్దఎత్తున లబ్ధి చేకూరిందని వివరించారు.
కడప ఉక్కు పరిశ్రమ నిర్మాణాన్ని త్వరలో ప్రారంభించనున్నట్లు ప్రకటించిన చంద్రబాబు, గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి కడప జిల్లాలో 7 సీట్లు గెలిచామని, వచ్చే ఎన్నికల్లో 10కి 10 సీట్లు గెలుస్తామన్న నమ్మకం తనకుందన్నారు.
“I will cut off the tails of those who tail others” – Chandrababu in Jammalamadugu
CM surprises public with an auto ride, announces steel plant in Kadapa
Chief Minister Chandrababu Naidu visited Jammalamadugu in Kadapa district on Friday, where he made sharp remarks against his political opponents and interacted directly with the public. He announced that the long-awaited Kadapa steel plant would soon begin construction.
During the visit, Chandrababu warned, “I will cut off the tails of those who follow others blindly,” clearly referring to his rivals. He accused the YSRCP of indulging in destructive politics and condemned Jagan for supporting individuals who had abused a woman MLA. “Do we really need leaders like Jagan?” he questioned.
In a gesture that surprised many, Chandrababu rode in a local auto-rickshaw from the helipad to the meeting venue, drawing admiration from the public. He then visited the homes of pension beneficiaries, handed over pensions personally, and spoke with their families to understand their living conditions.
He stated that the state government was spending ₹32,146 crore annually on pensions for the underprivileged. “Is there any scheme greater than this?” he asked. He also highlighted the impact of the ‘Vandanam’ scheme, which has benefited many women across the state.
Chandrababu reaffirmed that the Kadapa steel plant project will begin shortly, addressing a long-pending regional demand. Recalling the results of the last assembly elections, he noted that the TDP had won 7 seats in the undivided Kadapa district and expressed confidence that they would win all 10 seats in the upcoming elections.