
రాష్ట్ర ముఖ్యమంత్రి కడప పర్యటన విజయవంతం అయ్యేలా అన్ని శాఖల అధికారులు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. Chief Minister’s visit to Kadapa is being meticulously planned, with district officials instructed to ensure flawless arrangements.
బద్వేలు: ఆగస్టు 1న జమ్మలమడుగు నియోజకవర్గంలో పర్యటించనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. జమ్మలమడుగు ఆర్డీవో కార్యాలయంలో జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్, డిఆర్వో విశ్వేశ్వర నాయుడు, తెదేపా నేతలు శ్రీనివాసులు రెడ్డి, భూపేష్ రెడ్డి లతో కలిసి ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.
ప్రభుత్వం చేపడుతున్న పేదలకు పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా పెన్షన్ లబ్ధిదారుల కుటుంబాలతో సమావేశమై, అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారని చెప్పారు.
ముఖ్యమంత్రి పర్యటనకు ఎటువంటి లోపాలు లేకుండా భద్రతా చర్యలు, పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ, విద్యుత్, పారిశుధ్యం, పోలీసు, ఫైర్, ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసులు వంటి అన్ని విభాగాల సమన్వయం పటిష్టంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. హెల్త్ క్యాంపులు, హెల్ప్ డెస్క్, గ్రీవెన్స్ డెస్క్ లు ఏర్పాటు చేయాలని సూచించారు.
ఈ సమీక్ష సమావేశంలో కడప నగర కమిషనర్ మనోజ్ రెడ్డి, కడప, జమ్మలమడుగు, బద్వేలు, పులివెందుల ఆర్డీవోలు జాన్ ఇర్విన్, సాయిశ్రీ, చంద్రమోహన్, చిన్నయ్య, జిల్లాన్ఫిరే అధికారి ధర్మా రావు, డిఆర్డీఏ, డ్వామా, మెప్మా అధికారులతో పాటు ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు.
Chief Minister’s visit to Kadapa is being meticulously planned, with district officials instructed to ensure flawless arrangements. రాష్ట్ర ముఖ్యమంత్రి కడప పర్యటన విజయవంతం అయ్యేలా అన్ని శాఖల అధికారులు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
Badvel: District Collector Dr. Sridhar Cherukuri has instructed officials to complete the arrangements for Chief Minister Nara Chandrababu Naidu’s visit to Jammalamadugu constituency in Kadapa district on August 1. A review meeting was held at the Jammalamadugu RDO office along with District SP E.G. Ashok Kumar, DRDO Visweshwara Naidu, TDP Politburo member Srinivasulu Reddy, and constituency in-charge Bhupesh Reddy.
The Collector stated that the Chief Minister will participate in the government’s prestigious pension distribution program. He will personally visit the homes of pension beneficiaries, interact with them, and later address a public gathering.
The Collector directed that foolproof security, parking arrangements, traffic control, electricity, sanitation, police, fire, and emergency medical services be coordinated without any lapses. Health camps, help desks, and grievance desks are also to be set up in the areas where the CM’s programs are scheduled.
The review meeting was attended by Kadapa City Commissioner Manoj Reddy, RDOs of Kadapa, Jammalamadugu, Badvel, and Pulivendula—John Irwin, Saishree, Chandramohan, and Chinnayya—along with District Fire Officer Dharma Rao, DRDA, DWMA, MEPMA officials, DMHO Dr. Nagaraju, and other department heads.