CM Chandrababu Assures Support to Woman Tied to Tree in Chittoor;

బాధితురాలు శిరీషను పరామర్శించిన సీఎం చంద్రబాబు
చిత్తూరులో చెట్టుకు కట్టేసిన ఘటనపై స్పందన
చిత్తూరు, జూన్ 20:
కుప్పం మండలం నారాయణపురం గ్రామంలో అప్పు చెల్లించలేదన్న కారణంతో చెట్టుకు కట్టేసి అమానుషంగా హింసించిన ఘటనపై సీఎం చంద్రబాబు స్పందించారు. బాధితురాలు శిరీషతో ప్రత్యక్షంగా ఫోన్ కాల్ ద్వారా మాట్లాడారు.
ఈ ఘటనపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు – “ఇలాంటి మానవత్వం లేని చర్యలు తట్టుకోలేం. బాధ్యతవహించాల్సిన అధికారులకు ఇప్పటికే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించాం” అని తెలిపారు. బాధితురాలి ముగ్గురు పిల్లల భవిష్యత్తుపై ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని తెలిపారు.
శిరీష కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. అలాగే పిల్లల విద్యకు అవసరమైన పూర్తి మద్దతును ప్రభుత్వం అందిస్తుందని హామీ ఇచ్చారు. బాధితురాలిని పరామర్శిస్తూ న్యాయం జరిగే వరకు ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు.
Chandrababu Speaks to Shirisha, Victim of Inhuman Abuse in Chittoor
Promises ₹5 Lakh Aid, Education Support for Children
Chittoor, June 20:
Following the shocking incident in Narayanapuram village of Kuppam mandal where a woman named Shirisha was tied to a tree for not repaying a loan, Andhra Pradesh CM Chandrababu Naidu personally spoke to the victim and expressed solidarity.
Expressing deep anguish over the inhuman treatment, the CM said, “There’s no room for such barbaric behavior in society. I’ve already directed officials to take strict action against the culprits.”
Chandrababu announced ₹5 lakh financial assistance for Shirisha’s family and assured the government would take full responsibility for the education of her three children. He stated the government would stand by the victim and ensure justice is served.