Brutality in Haryana – Man Suspended Upside Down and Tortured by Security Guards over Theft Allegation…హరియాణాలో దారుణం

హరియాణాలో దారుణం – దొంగతనం చేశాడని నెపంతో వ్యక్తిని తలకిందులుగా వేలాడదేసి హింసించిన సెక్యూరిటీ గార్డులు

గురుగ్రామ్‌లో ఓ జేసిబి డ్రైవర్‌ను దొంగతనంపై అనుమానంతో సెక్యూరిటీ గార్డులు చిత్రహింసలు పెట్టారు. బాధితుడిని తలకిందులుగా వేలాడదేసి కరాళతనాన్ని ప్రదర్శించారు.

హరియాణాలోని గురుగ్రామ్ నగరంలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ నిర్మాణంలో కరెంటు వైర్లు దొంగలించాడని అనుమానంతో జేసిబి డ్రైవర్‌గా పనిచేస్తున్న వ్యక్తిని అక్కడే విధుల్లో ఉన్న సెక్యూరిటీ గార్డులు పట్టుకున్నారు. తర్వాత అతన్ని తలకిందులుగా వేలాడదేసి చిత్ర హింసలు పెట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు.

ఈ ఘటనపై స్పందించిన పోలీసులు, నలుగురు సెక్యూరిటీ గార్డులను అరెస్ట్ చేశారు. వారు పుష్పేంద్ర, అజిత్ సింగ్, కృష్ణ కుమార్, అమిత్ కుమార్‌లుగా గుర్తించారు. బాధితుడికి ప్రస్తుతానికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని గురుగ్రామ్ పోలీసులు స్పష్టం చేశారు.
Brutality in Haryana – Man Suspended Upside Down and Tortured by Security Guards over Theft Allegation

In Gurugram, a JCB driver was brutally tortured by security guards who suspected him of stealing electric wires. He was suspended upside down and physically abused.

A horrific incident occurred in Gurugram, Haryana, where a group of security guards brutally tortured a man accused of theft. The victim, a JCB driver, was accused of stealing electric wires from a construction site. In response, the guards tied him upside down and subjected him to severe physical abuse. A video of the incident went viral on social media, prompting police to take suo moto action and file a case.

Following an investigation, the Gurugram police arrested four security guards involved in the incident. They have been identified as Pushpendra, Ajit Singh, Krishna Kumar, and Amit Kumar. The victim is currently undergoing treatment at a hospital. Police have clarified that no one is above the law and that strict action will be taken against the accused.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *