
నిరుద్యోగ హామీలను గుర్తు చేస్తూ BRS విద్యార్థి విభాగం ప్రచార పోస్టర్ విడుదల
BRSV releases poster highlighting Congress’ unfulfilled promises to the unemployed
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎదుర్కొంటూ, బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ప్రత్యేక గూగుల్ స్కానర్ పోస్టర్ను విడుదల చేసింది.
In a move to highlight the unfulfilled promises made by the Congress government to unemployed youth, BRS Student Wing (BRSV) launched a special Google Scanner Poster.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో రూపొందిన ఈ పోస్టర్ను బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి రాజేష్ నాయక్ రూపొందించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన యూత్ డిక్లరేషన్, జాబ్ క్యాలెండర్, 420 హామీలన్నీ మోసం అయిన యువతకు గుర్తు చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రచార కార్యక్రమం చేపట్టారు.
Despite nearly a year in power, the Congress government has not issued even a single job notification, BRSV leaders alleged. They criticized the government for failing to honor the promises made to unemployed youth during the election campaign, leaving them disillusioned.
ఈ పోస్టర్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ ద్వారా కాంగ్రెస్ మేనిఫెస్టో, యూత్ డిక్లరేషన్, 420 హామీల వివరాలు, అలాగే రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కలు ఇచ్చిన హామీల వీడియోలను ఓదార్చి ప్రజలకు అందుబాటులో ఉంచారు.
The poster includes a QR code linking directly to Congress’ youth manifesto, 420 promises, and videos of commitments made by Rahul Gandhi, Revanth Reddy, and Bhatti Vikramarka — enabling the public to verify facts for themselves.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, “ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం మేల్కొని, యువతను మోసం చేసిన తీరును గమనించి, హామీల అమలుకు చర్యలు తీసుకోవాలి” అని డిమాండ్ చేశారు.
KTR demanded that the Congress government open its eyes to the deception inflicted on youth and immediately begin fulfilling its promises.
కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, రాష్ట్ర నాయకులు పల్లా ప్రవీణ్ రెడ్డి, వల్లమల్ల కృష్ణా, విద్యార్థి విభాగం ఉపాధ్యక్షులు పడాల సతీష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యువతను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు నిలదీయాల్సిన అవసరం ఉందని వారు పేర్కొన్నారు.