
స్థానిక సంస్థల ఎన్నికలకు బిఆర్‌ఎస్ సన్నద్ధం — పార్టీ శ్రేణుల సమావేశాలకు కెటిఆర్ ఆదేశం | BRS gears up for local body polls — KTR directs cadre to hold key meetings
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ, బిఆర్‌ఎస్ పార్టీ శ్రేణులను సిద్ధం చేయాలని కెటిఆర్ ఆదేశించారు. ప్రతి నియోజకవర్గంలో ముఖ్య కార్యకర్తల సమావేశాలు నిర్వహించాలని సూచించారు.
As local body elections are likely to be held soon, KTR has directed BRS leaders to gear up and hold preparatory meetings with key party workers across all constituencies.
తెలంగాణలో కోర్టు ఆదేశాల నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగవచ్చన్న వార్తల నేపథ్యంలో, బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి. రామారావు పార్టీ శ్రేణులను ముందుగానే సిద్ధం చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. జిల్లా పార్టీ అధ్యక్షులు తమ జిల్లాల్లోని ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ముఖ్య కార్యకర్తల సమావేశాలను ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు.
ఈ సమావేశాల్లో పార్టీకి చెందిన ఎంఎల్‌ఎలు, ఎంపిలు, ఎంఎల్‌సిలు, జెడ్‌పి చైర్మన్లు, కార్పొరేషన్‌లకు చెందిన మాజీ చైర్మన్లు, రాష్ట్ర స్థాయి సీనియర్ నాయకులు పాల్గొనాల్సిందిగా చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాలు, అవినీతి, వ్యవసాయ సమస్యలు, ప్రజాప్రతినిధుల వైఫల్యాలపై గ్రామస్థాయిలో ప్రచారం చేయాలని కెటిఆర్ దిశానిర్దేశం చేశారు.
రైతుబంధు రద్దు, విత్తనాల కొరత, సాగునీటి సమస్య, విద్యుత్ సరఫరాలో వైఫల్యం, పారిశుద్ధ్యం బీభత్సం, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఆర్డినెన్స్ డ్రామా వంటి అంశాలపై ప్రజలకు వివరంగా తెలియజేయాలని ఆయన చెప్పారు. అలాగే 4000 రూపాయల వృద్ధుల పెన్షన్, ఆడబిడ్డలకు 2500 రూపాయల పథకాల వాస్తవికతను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
గత 20 నెలలుగా కాంగ్రెస్ పాలనపై బిఆర్‌ఎస్ చేస్తున్న ప్రజా పోరాటాలు, నిరసన కార్యక్రమాలను గుర్తు చేస్తూ, రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఈ వారంలో ముఖ్య కార్యకర్తల సమావేశాలు ప్రారంభించాలని కెటిఆర్ స్పష్టం చేశారు.
Telangana BRS begins poll preparedness — KTR directs cadre to hold key meetings in all constituencies
With the likelihood of local body elections being announced soon in Telangana, BRS working president K.T. Rama Rao has instructed party leaders to initiate preparatory activities. He directed that meetings with key party workers be held at each constituency headquarters.
Following recent court developments suggesting that local elections may be conducted soon, KTR has emphasized the need to organize the party base early. He instructed district BRS presidents to coordinate and conduct worker meetings in all assembly constituencies.
The meetings are expected to involve MLAs, MPs, MLCs, ZP chairpersons, former corporation chairpersons, and senior state-level party leaders. KTR urged that these gatherings be used to expose the failures of the Congress-led Revanth Reddy government — especially issues like corruption, neglect of farmers, unfulfilled promises, and poor administration.
He highlighted how the Congress government stopped Rythu Bandhu payments, failed to resolve irrigation and seed shortages, and misled the public on BC reservations with false ordinances. KTR also pointed out the non-implementation of promises like ₹4,000 pension for senior citizens and ₹2,500 per month for girl children.
KTR called upon party workers to remind people of the ongoing public struggles and protests led by BRS over the last 20 months and instructed them to begin these meetings in all constituencies across the state within this week.