2025 బోనాల ఉత్సవాలపై సమీక్షా సమావేశం – ₹20 కోట్లతో భారీ ఏర్పాట్లు

Bonalu 2025: Telangana Govt Begins Mega Arrangements with ₹20 Crore Budget for english news kindly Scroll Down

2025 బోనాల ఉత్సవాలపై సమీక్షా సమావేశం – ₹20 కోట్లతో భారీ ఏర్పాట్లు

హైదరాబాద్
తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో 2025లో జరిగే బోనాల ఉత్సవాల కోసం ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. హైదరాబాదులో జూలై నెలలో జరిగే ఈ ఆషాఢ మాస ఉత్సవాలపై అధికారులతో సమీక్షా సమావేశం జరిగింది.

ఈ సమీక్షా సమావేశంలో హైదరాబాద్ ఇన్‌చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, డిజిపి జితేందర్, సీపీ సీవీ ఆనంద్, మంత్రి కొండా సురేఖ, ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, ఎండోమెంట్స్ అధికారులు, మూడు సీపీలు, డీసీపీలు, పోలీస్, మునిసిపల్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

బోనాల తేది షెడ్యూల్

  • జూన్ 26: గోల్కొండ బోనాలు (మొదటి పూజ)
  • జూలై 1: బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం
  • జూలై 13: సికింద్రాబాద్ బోనాలు (లష్కర్ బోనాలు)
  • జూలై 14: రంగం కార్యక్రమం
  • జూలై 20: లాల్‌దర్వాజ బోనాలు
  • జూలై 21: రంగం కార్యక్రమం (ఓల్డ్ సిటీ)

ఈ సంవత్సరం బోనాల కోసం రూ. 20 కోట్ల బడ్జెట్ కేటాయించి, అన్ని శాఖల సమన్వయంతో ఘనంగా ఉత్సవాలను నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు.

Bonalu 2025: Telangana Govt Begins Mega Arrangements with ₹20 Crore Budget

Hyderabad
The Telangana government has kickstarted the preparations for the grand Bonalu festivities in Hyderabad, which will take place throughout the Ashada month in 2025. A high-level coordination review meeting was held with multiple departments to ensure smooth conduct of the traditional celebration.

The meeting was attended by Hyderabad In-Charge Minister Ponnam Prabhakar, MP Anil Kumar Yadav, DGP Jitender, CP CV Anand, Minister Konda Surekha, Principal Secretary Shailaja Ramaiyer, officials from the Endowments Department, Commissioners of all city zones, DCPs, and key representatives from police and civic departments.

The month-long festivities will begin from June 26, starting with Golkonda Bonalu and the first puja. Key events include:

  • July 1: Balkampet Yellamma Kalyanam
  • July 13: Secunderabad Bonalu (Lashkar Bonalu)
  • July 14: Rangam Ritual
  • July 20: Lal Darwaza Bonalu (Old City)
  • July 21: Rangam at Lal Darwaza

The government has allocated ₹20 crore for the arrangements this year, ensuring a grand and safe celebration of the state’s cultural heritage.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *