Blue Aadhaar, also called Bal Aadhaar, is issued to children below 5 years of age without biometric data; parents can apply online and book appointments for doorstep enrollment.

బాల ఆధార్ గురించి స్పష్టత లేదు? 5 ఏళ్ల లోపు పిల్లలకు బ్లూ ఆధార్ ఎలా తీసుకోవాలో తెలుసుకోండి

Blue Aadhaar, also called Bal Aadhaar, is issued to children below 5 years of age without biometric data; parents can apply online and book appointments for doorstep enrollment.

మీ ఇంట్లో ఐదేళ్ల లోపు చిన్న పిల్లలు ఉన్నారా? వారికి ఆధార్ కార్డు తీసుకోలేదా? అయితే, ప్రత్యేకంగా ఆ వయస్సు పిల్లల కోసం రూపొందించిన బ్లూ ఆధార్ కార్డు తీసుకోవచ్చు. ఇది బయోమెట్రిక్ లేకుండా జారీ అవుతుంది. UIDAI ఈ ప్రక్రియను మరింత సులభతరం చేసింది. ఇప్పుడు పుట్టిన తేది డాక్యుమెంట్ లేకపోయినా అప్లై చేయొచ్చు. ఆధార్ కోసం ఇంటి నుంచే అప్లికేషన్ దాఖలు చేయవచ్చు. అనంతరం అపాయింట్‌మెంట్ బుక్ చేసి, సమీప కేంద్రానికి వెళ్లాలి.

బ్లూ ఆధార్ అంటే ఏమిటి?

బాల ఆధార్ లేదా బ్లూ ఆధార్ అనేది ఐదేళ్ల లోపు చిన్నారుల కోసం తయారుచేసే ప్రత్యేక ఆధార్ కార్డు. దీనికి ఫింగర్‌ప్రింట్స్, ఐరిస్ స్కాన్ వంటి బయోమెట్రిక్స్ అవసరం ఉండదు. UIDAI అధికారికంగా ఇది అందిస్తున్న ఆధార్ ఫార్మాట్. ఐడీ ప్రూఫ్‌గా ప్రభుత్వ పనులకు ఇది ఉపయోగపడుతుంది.

ఎలా అప్లై చేయాలి?:

  1. UIDAI అధికారిక వెబ్‌సైట్ www.uidai.gov.in లాగిన్ అవ్వండి
  2. ‘Aadhaar for Children’ సెక్షన్‌లోకి వెళ్లండి
  3. పిల్లల పేరు, మొబైల్ నంబర్, ఇమెయిల్ వంటి వివరాలు నమోదు చేయండి
  4. అపాయింట్‌మెంట్ బుక్ చేసుకొని సమీప కేంద్రానికి వెళ్లండి
  5. అవసరమైన డాక్యుమెంట్లు అందించి ఆధార్ ప్రక్రియను పూర్తిచేయండి

ఈ ఆధార్ కార్డు పిల్లలు ఐదేళ్లు నిండే వరకు చెల్లుబాటు అవుతుంది. ఐదేళ్లు నిండిన తర్వాత బయోమెట్రిక్ అప్‌డేట్ అవసరం ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *