Birthday Wishes Pour In for Telangana Leader T. Harish Rao for English News Kindly Scroll Down

అలుపెరుగని పోరాటం నుండి అభివృద్ధి సాధించడమే కాదు ప్రతిపక్షంలోనూ ప్రజల కోసమే…

జననేత హరీష్ రావుకు జన్మదిన శుభాకాంక్షల వెల్లువ
హైదరాబాద్ – మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత తన్నీరు హరీష్ రావు పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా శుభాకాంక్షలతో సందడి నెలకొంది. బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు తమ తమ ప్రాంతాల్లో పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోపాటు ఇతర పార్టీల నేతలు కూడా హరీష్ రావుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో హరీష్ రావు పుట్టినరోజు పురస్కరించుకొని అభిమానులు భారీ సంఖ్యలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ హరీష్ రావు ఉద్యమ పోరాట సమయం నుండి మొదలుకొని నేటి వరకు ఎన్నో మధుర జ్ఞాపకాల ఫోటోలు భారీగా పోస్ట్ చేస్తూ వేలాది మంది అభిమానులు అభినందనలు తెలిపారు.
అలుపెరుగని సేవా దీక్షతో పాటు ప్రజల సమస్యలపై వెంటనే స్పందించే ట్రబుల్ షూటర్‌గా కూడా ఆయన ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు.

Birthday Wishes Pour In for People’s Leader T. Harish Rao
Hyderabad – On the occasion of former minister and senior BRS leader T. Harish Rao’s birthday, greetings poured in from across Telangana. BRS party cadres and supporters celebrated the day with enthusiasm in various regions.
From BRS working president K.T. Rama Rao to leaders of different political parties, many extended their heartfelt wishes to Harish Rao. Social media platforms were flooded with nostalgic messages, photos, and videos highlighting his journey from the Telangana movement to his development-driven leadership.
Admired as a tireless warrior and trusted troubleshooter, Harish Rao continues to hold a special place in the hearts of the people. His consistent dedication to public welfare, both in power and in opposition, has earned him respect across political lines.