
బద్వేల్‌లో నకిలీ ఇంటి/వ్యవసాయ భూమి పట్టాల రాకెట్‌ను పోలీసులు భగ్నం చేసి 10 మందిని అరెస్ట్ చేశారు, 3 మంది పరారీలో ఉన్నారు.
Badvel police busted a fake patta/agricultural land document racket, arresting 10 while 3 are absconding.
బద్వేలు: బద్వేలు అర్బన్ పోలీస్‌లు శుక్రవారం నకిలీ ఇంటి పట్టాలు, వ్యవసాయ భూముల పాస్‌బుక్స్ తయారు చేస్తున్న ముఠాపై దాడి చేసి 10 మందిని అరెస్ట్ చేశారు. మొత్తం 13 మందిపై కేసు నమోదు చేయగా, ముగ్గురు పరారీలో ఉన్నారని మైదుకూరు డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్, బద్వేలు అర్బన్ సీఐ రాజగోపాల్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. గోపవరం తహసిల్దార్ త్రివుబంధ్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. అరెస్టైన వారిలో ఒక రెవెన్యూ సిబ్బందితో పాటు దాసరి రత్నమ్మ, పొట్టిపాటి ప్రసాద్, పిల్లి భాస్కర్, మన్యం బాబురావు, బత్తిన రవిశంకర్, షేక్ బాబ్జాన్, అన్నపురెడ్డి శ్రీనివాసులు, ఓబులేష్, రామాంజనేయులు ఉన్నారు. కడపకు చెందిన బాబు ప్రింటర్స్ యజమాని షేక్ బాబ్జాన్ నకిలీ పట్టాలు, రెవెన్యూ సీల్లు తయారీలో కీలకపాత్ర పోషించినట్లు పోలీసులు తెలిపారు. వీరు బద్వేలు నియోజకవర్గంలోని ఏడుమండలాల్లో నకిలీ పత్రాలు తయారు చేసి అవసరమైన వారికి విక్రయిస్తున్నట్లు విచారణలో బయటపడింది.
స్వాధీనం చేసిన వస్తువులు (పోలీసుల ప్రకారం):
- రెవెన్యూ కార్యాలయాల నకిలీ సీల్లు
- 46 వ్యవసాయ D-నమూనా పత్రాలు
- 96 ఇంటి స్థలం DKT పత్రాలు
- 280 అనుబంధ పత్రాలు
- 28 పట్టాదారు పాస్‌బుక్స్
- 70 పొజిషన్ సర్టిఫికెట్లు
- 35 వ్యవసాయ భూమి ఖాళీ పత్రాలు
- ఇంక్ ప్యాడ్లు 5, గమ్ము బటన్‌లు 2
- రబ్బర్ స్టాంపులు తయారు చేసే మిషన్ 1, ప్రింటర్ 1, పెన్నులు 4
ఈ కేసు వివరాలపై బద్వేలు రూరల్ సీఐ నాగభూషణ్, అర్బన్ ఎస్ఐలు సత్యనారాయణ, జయరాం రెడ్డి తదితరులు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.
Badvel police busted a fake patta and agricultural land document racket, arresting 10 people while 3 others remain absconding. Counterfeit revenue seals, passbooks, and a printing machine were seized during the raid.
Badvel: On Friday, Badvel Urban Police arrested 10 members of a gang involved in fabricating fake house pattas and agricultural land passbooks. A total of 13 people were booked, with 3 suspects still on the run, said Mydukuru DSP Rajendra Prasad and Badvel Urban CI Rajagopal in a press briefing. Acting on a complaint filed by Gopavaram Tahsildar Trivubhand Reddy, the police carried out the operation.
Among those arrested are a revenue staff member along with Dasari Ratnamma, Pottipati Prasad, Pilli Bhaskar, Manyam Baburao, Battina Ravishankar, Shaik Babjan, Annapureddy Srinivasulu, Obulesh, and RamAnjaneyulu. According to police, Shaik Babjan, owner of Babu Printers in Kadapa, played a key role in producing counterfeit pattas and revenue seals. The gang was operating across seven mandals in Badvel constituency, preparing and selling fake documents to clients.
Items Seized by Police:
- Fake revenue office seals
- 46 agricultural D-sample papers
- 96 house-site DKT papers
- 280 annexure papers
- 28 patta passbooks
- 70 position certificates
- 35 blank agricultural land forms
- 5 ink pads, 2 gum bottles
- 1 rubber-stamp making machine, 1 printer, 4 pens
Badvel Rural CI Nagabhushan, along with Urban SIs Satyanarayana and Jayaram Reddy, participated in the press meet that disclosed these details.