AP Cabinet clears 12 major decisions: Free RTC travel for women from Aug 15, ration cards from Aug 25..ఏపీ క్యాబినెట్

ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు: మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి ఆమోదం, కొత్త రేషన్ కార్డుల పంపిణీకి గ్రీన్ సిగ్నల్
AP Cabinet clears 12 major decisions: Free RTC travel for women from Aug 15, ration cards from Aug 25

ఏపీ క్యాబినెట్ బుధవారం సమావేశమై పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం నుంచి టూరిజం హాస్టళ్ల ప్రైవేటీకరణ వరకూ 12 అంశాలకు ఆమోదం తెలిపింది.

The Andhra Pradesh Cabinet, chaired by CM Chandrababu, approved 12 key proposals during its meeting held at the Secretariat on Wednesday. Major decisions include free RTC bus travel for women starting August 15 and distribution of new ration cards from August 25.

మహిళలకు ఆగస్టు 15 నుండి ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణం కల్పించాలని, ఈ నెల 25 నుండి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయాలని మంత్రివర్గం ఆమోదించింది. నూతన బార్ పాలసీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నాయి బ్రాహ్మణులకు ఉచిత విద్యుత్‌ను 150 యూనిట్ల నుంచి 200 యూనిట్ల వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

The Cabinet approved the implementation of a new bar policy and increased the free electricity supply for Nai Brahmins from 150 to 200 units.

ఏపీ ల్యాండ్ ఇన్సెంటివ్ టెక్ హబ్ పాలసీ 4.0కి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. టూరిజం కార్పొరేషన్‌కు చెందిన 22 హాస్టళ్లను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించేందుకు అనుమతి ఇచ్చింది.

Approval was given to the AP Land Incentive Tech Hub Policy 4.0. The Cabinet also cleared the privatization of 22 APTDC hostels under the Tourism Corporation.

తిరుపతి రూరల్‌లో ఓబరాయ్ హోటల్ నిర్మాణానికి కేటాయించిన టీటీడీ భూమి బదలాయింపును రద్దు చేయాలని నిర్ణయించింది. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు రూ.900 కోట్ల గ్యారంటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీఐఐసీకి రూ.7500 కోట్ల రుణం తీసుకునేందుకు అనుమతించింది.

The Cabinet revoked the land allotment made earlier for an Oberoi Hotel in Tirupati rural area. It approved a ₹900 crore guarantee for Power Finance Corporation loans and sanctioned APIDC to raise ₹7500 crore through loans.

ఇంకా, ఐదు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులకు అనుమతి ఇచ్చింది. మావోయిస్టు, ఆర్‌డీఈఎఫ్ కార్యకలాపాలపై నిషేధాన్ని మరో ఏడాది పాటు కొనసాగించాలని నిర్ణయించింది.

Approval was also given for creating five Assistant Public Prosecutor posts and extending the ban on Maoist and RDF activities for one more year.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *