Andhra Pradesh is positioning itself at the forefront of global tech shifts through data revolution, AI, and quantum computing, said Minister Nara Lokesh, stressing the state’s intent to partner with nations like the UAE to accelerate digital economic growth..

డేటా విప్లవం, ఎఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి విభాగాల్లో ప్రపంచ మార్పులకు అనుగుణంగా నడుస్తూ, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో ముందు వరుసలో ఉంది. ఈ మార్గాన్ని ముందుకు నడిపేందుకు యుఎఈ వంటి దేశాలతో జి టు జి సహకారం పెంచుకుంటామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు.

Andhra Pradesh is positioning itself at the forefront of global tech shifts through data revolution, AI, and quantum computing, said Minister Nara Lokesh, stressing the state’s intent to partner with nations like the UAE to accelerate digital economic growth.

విజయవాడలోని నోవాటెల్ హోటల్‌లో ఎకనమిక్ డెవలప్‌మెంట్ బోర్డు ఆధ్వర్యంలో జరిగిన ‘ఇన్వెస్టోపియా గ్లోబల్ – ఆంధ్రప్రదేశ్’ సదస్సులో మంత్రి నారా లోకేష్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దక్షిణ ఆసియాలోనే తొలి 152-బిట్ క్వాంటమ్ కంప్యూటర్‌ను జనవరిలో అమరావతిలో ఆవిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇది దేశ ఆర్థిక-సాంకేతిక రంగాలను ప్రభావితం చేసే పరిణామమని చెప్పారు.

విశాఖపట్నం డేటా హబ్‌గా అభివృద్ధి చెందుతున్నదని, అంతర్జాతీయ కంపెనీలు అక్కడ తమ డేటా సెంటర్లు ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయని చెప్పారు. విద్యావ్యవస్థలో కూడా ప్రగతిశీల మార్పులు చేస్తున్నామని, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్ కోర్సుల్లో ఎఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ అంశాలను సిలబస్‌లోకి తెచ్చామని వివరించారు.

పౌరులకు మెరుగైన సేవలందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఎఐ వినియోగాన్ని పెంచుతుందని, ప్రజల సమస్యలు గుర్తించి వాటికి వేగంగా పరిష్కారాల కోసం ‘మనమిత్ర’ పేరిట వాట్సాప్ గవర్నెన్స్‌ను ప్రారంభించినట్టు తెలిపారు. దీనివల్ల 600కి పైగా పౌరసేవలు వేగంగా అందుతున్నాయన్నారు.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఈ) ప్రపంచంలోనే తొలిసారిగా ఎఐ మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసిన దేశమని గుర్తు చేస్తూ, ఆ దేశం ట్రాఫిక్ నియంత్రణలో ఎఐను వినియోగిస్తోందని వివరించారు. AI వల్ల ఉద్యోగాలు పోతాయన్న వాదనను ఖండిస్తూ, ప్రతి పారిశ్రామిక విప్లవం కొత్త ఉద్యోగావకాశాలను తెచ్చిందన్నారు.

జీటూజీ సహకారంగా యుఎఈతో కలిసి డిజిటల్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఇదే సదస్సులో ఆయన యుఎఈ ఆర్థిక మంత్రి అబ్దుల్ బిన్ తక్ ఆల మరితో సమావేశమయ్యారు. రెన్యువబుల్ ఎనర్జీ, జీనోమ్ సీక్వెన్సింగ్, లాజిస్టిక్స్, డిజిటల్ గవర్నెన్స్, ఎఐ ఫస్ట్ యూనివర్సిటీ, క్వాంటమ్ వ్యాలీ వంటి రంగాల్లో పెట్టుబడులపై చర్చ జరిగింది. మంత్రి లోకేష్‌ను యుఎఈ పర్యటనకు ఆహ్వానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *