ఏడాది పాలనలో ఎమ్మెల్యేల పనితీరు ప్రశ్నార్థకం : కలకలం రేపుతున్న ఉత్తరాంధ్ర సర్వే

Survey Sparks Debate: One Year of Andhra Coalition Govt — North Coastal Dissatisfaction Rises for English kindly scroll down

కలకలం రేపుతున్న ఉత్తరాంధ్ర సర్వే: ఏడాది పాలనలో ఎమ్మెల్యేల పనితీరు ప్రశ్నార్థకం

విశాఖపట్టణం, జూన్ 10:
ఏపీ కూటమి ప్రభుత్వానికి అధికారంలోకి వచ్చిన సంవత్సరం పూర్తవుతోంది. 2024 జూన్ 12న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తదితరులు ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ సమతుల్యంగా తీసుకెళ్తూ పాలన సాగుతోంది.

అయితే తాజాగా వచ్చిన రైజ్ సర్వే వివరాలు కూటమికి మింగుడు పడని వాస్తవాలను వెలుగులోకి తెస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో టీడీపీ కూటమి ఎమ్మెల్యేలపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతున్నట్లు సర్వే స్పష్టం చేస్తోంది.

ఉత్తరాంధ్రలోని 34 అసెంబ్లీ స్థానాలలో గత ఎన్నికల్లో 32 స్థానాల్లో టీడీపీ కూటమి విజయం సాధించింది. కానీ ప్రస్తుతం ప్రజాభిప్రాయం మారుతోంది. సర్వే ప్రకారం, 17 మంది ఎమ్మెల్యేలపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. ఇందులో 9 మంది విషయమైతే తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

ఈ వివరాలను రైజ్ సర్వే ప్రతినిధి ప్రవీణ్ పుల్లట్ సోషల్ మీడియాలో వెల్లడించారు. త్వరలో మిగిలిన మూడు ప్రాంతాల ఫలితాలను కూడా విడుదల చేయనున్నట్టు తెలిపారు. ఇదే సంస్థ గతంలో కూటమికి అనుకూల సర్వేలు ఇచ్చిన నేపథ్యంలో తాజా ఫలితాలు ఆందోళన కలిగిస్తున్నాయి.

ఇదిలా ఉండగా, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పనితీరుపై ప్రజల నుంచి సానుకూల స్పందన వస్తోందని సర్వే చెబుతోంది. అదే సమయంలో ప్రభుత్వ నిఘా వర్గాలు కూడా ఎమ్మెల్యేల పనితీరుపై గమనించడమే కాకుండా వారిని

One Year of Andhra Coalition Rule: Rise Survey Flags Public Discontent with MLAs in North Andhra

Visakhapatnam, June 10:
As the Andhra Pradesh coalition government completes its first year in office on June 12, a recent survey has sparked political tremors in the state, especially in the North Coastal districts.

The Rise Survey, conducted under the supervision of Praveen Pullat, has revealed growing public dissatisfaction toward several MLAs of the ruling TDP-led alliance. While Chief Minister Chandrababu Naidu, Deputy CM Pawan Kalyan, and Minister Lokesh have been praised for their leadership, the same cannot be said for many legislators.

Out of 34 assembly constituencies in North Andhra (Srikakulam, Vizianagaram, Visakhapatnam), the TDP alliance secured 32 seats in 2024. However, current sentiment tells a different story. According to the survey, 17 of these MLAs are facing moderate to high levels of public backlash. Alarmingly, 9 of them are under strong disapproval from their constituencies.

Rise Survey’s findings indicate that despite pro-government sentiment at the top, dissatisfaction at the grassroots level is rising. The revelation is particularly concerning given that the same firm had previously released favorable results for the coalition.

The government is reportedly taking the findings seriously. Intelligence units and internal monitoring wings have already warned the MLAs, urging them to improve their public outreach and performance. CM Chandrababu has also reportedly given stern instructions for course correction.

The political leadership is now awaiting results from the remaining three regions to gauge the full picture. As it stands, the one-year performance report card has brought both hope and warning signals.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *