కనుల పండుగ అలియాబాద్ శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణోత్సవం… స్వామివార్లకు పట్టు వస్త్రాలు సమర్పించిన అలియాబాద్ మున్సిపల్ చైర్మన్ కంఠం శిరీష కృష్ణారెడ్డి.

ఘనంగా కొనసాగుతున్న శ్రీ రామచంద్ర స్వామి దేవస్థాన వార్షిక బ్రహ్మోత్సవాలు…

Sri Sitarama Kalyanam celebrated grandly in Aliabad of Medchal-Malkajgiri district

స్వయంభుగా వెలసిన అలియాబాద్ శ్రీ రామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. దశాబ్దాల చరిత్ర గలిగిన అలియాబాద్ శ్రీ రామచంద్రస్వామి దేవాలయంలో అనాదిగా సీతారాముల కళ్యాణం ఘట్టం మొదలు ఆంజనేయ జయంతి వరకు అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించబడుతున్నాయి. అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా అనగా 25-06-2026 నుండి మొదలు పూర్ణిమ తేదీ 2-04-2026 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం భక్తిశ్రద్ధల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం సంప్రదాయబద్ధంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయంలో మహాగణపతి పూజ, స్వస్తి వాచనం, ప్రత్యేక అభిషేకాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారణల మధ్య శ్రీ సీతారామచంద్ర స్వామివారి కళ్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

ఉత్సవాల్లో భాగంగా అలియాబాద్ మున్సిపాలిటీ చైర్‌పర్సన్ కంఠం శిరీష కృష్ణారెడ్డి దంపతులు స్వామివార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం తలంబ్రాలు సమర్పించి, శ్రీ సీతారామచంద్ర స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. ఆలయ పూజారులు, వ్యవస్థాపక ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో ఎదుర్కోలు కార్యక్రమం కూడా నిర్వహించారు.

ఈ కళ్యాణ మహోత్సవాన్ని ఆలయ పూజారులు పార్నంది రఘుపతి శర్మ, పార్నంది రామ్మోహన్ శర్మ శాస్త్రోక్తంగా నిర్వహించగా, మొత్తం ఉత్సవాలు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తల పర్యవేక్షణలో కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు, గ్రామ పెద్దలు, నాయకులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి దివ్య కళ్యాణాన్ని దర్శించుకున్నారు.

తెలంగాణలో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయ బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్నాయని ఆలయ నిర్వాహకులు తెలిపారు.

The annual Brahmotsavam celebrations at Sri Sitarama Chandra Swamy Temple in Aliabad of Shamirpet mandal, Medchal-Malkajgiri district, Telangana, are being conducted with religious fervour. As part of the celebrations, Sri Sitarama Kalyanam was performed grandly in the presence of devotees.

Special rituals including Maha Ganapathi Puja, Swasti Vachanam and Abhishekam were performed as part of the temple festivities. The celestial wedding ceremony was conducted by temple priests as per Vedic traditions.

As part of the celebrations, Aliabad Municipal Chairperson Kantham Sirisha Krishna Reddy and her husband offered silk clothes to the deities. They later offered Talambralu and participated in the Kalyanam ceremony. Traditional Edurukolu ritual was also conducted under the supervision of temple priests and the temple trust board.

Local leaders, village elders and a large number of devotees participated in the event and witnessed the divine wedding ceremony.

Temple priests Parnandi Raghupathi Sharma and Parnandi Rammohan Sharma performed the rituals while the temple founding trustees supervised the arrangements.

Temple authorities said the annual Brahmotsavam of this historic temple continues to attract devotees from surrounding areas every year.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *